Dubbaka: దుమ్ము రేపుతున్న దుబ్బాక పోరు.. బరిలో దిగ్గజనేతలు!!
దుబ్బాకలో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంది. దుబ్బాక ఎన్నికల బరిలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్న ముఖ్య పార్టీల నేతలు హోరాహోరీ ప్రచారంతో దుమ్ము రేపుతున్నారు. దుబ్బాకలో విజయం సాధించడం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే, మళ్లీ దుబ్బాకలో విజయం సాధించటం కోసం ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు బిజెపి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా పోరాడుతున్నారు. నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా దొమ్మాట స్థానం దుబ్బాక నియోజకవర్గమైంది. లక్షా 98 వేల మందికి పైగా వున్న దుబ్బాకలో కొత్త ఓటర్లు పెద్ద సంఖ్యలో వుండి అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయించే అవకాశం వుంది.

దుబ్బాక నియోజకవర్గంలో పోటీ అక్కడ దిగ్గజ నేతలైన రఘునందన్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.దుబ్బాక నియోజకవర్గంలో 11 మంది అభ్యర్ధులు బరిలో వున్నా, ప్రధాన పార్టీలు BRS, BJP, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్యే ప్రధాన పోటీ నెలకొని వుంది.
అయితే BSP, పలు గుర్తింపు లేని పార్టీల అభ్యర్ధులు, మరో ముగ్గురు స్వతంత్రులు కూడా బరిలో వున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్తా ప్రభాకర్ రెడ్డి అధికార BRS అభ్యర్ధిగా ఈసారి శాసనసభ బరిలో నిలవగా, కొద్ది రోజుల క్రితం ప్రచారంలో జరిగిన దాడిలో గాయపడ్డారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక BRS నాయకులు ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కాగా సిట్టింగ్ BJP శాసనసభ్యుడు రఘునందన్ రావు మరోసారి ఆ పార్టీ నుంచి పోటీలో దిగి దుబ్బాకలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఇచ్చిన హామీలను తమ పార్టీ నిలబెట్టుకుంటుందని, రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆయన ప్రచారం చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి దుబ్బాక బరిలో నిలిచారు. కాంగ్రెస్ ఆరు డిక్లరేషన్లను ప్రచారం చేస్తూ, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎవరికివారు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో దుబ్బాకలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications