హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ విధుల్లో ట్రాన్స్ జెండర్లు.. రేవంత్ సర్కార్ నయా ప్లాన్!
గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్ జెండర్ లు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ పెద్ద సమస్యగా ఉండేవారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అటువంటి సమస్యకు చక్కని పరిష్కారాన్ని వెతికింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ లను సమాజానికి పనికి వచ్చే విధంగా తయారు చేసే పని మొదలుపెట్టింది.
ట్రాఫిక్ కూడళ్ళ వద్ద ట్రాన్స్ జెండర్ ల విధులు
ఒకప్పుడు ఎక్కడైతే ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారులను ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అక్కడే ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి పనిచేయబోతున్నారు. గౌరవంగా బ్రతకబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్ జెండర్ లు ఇప్పుడు ట్రాఫిక్ కూడళ్ళ వద్ద కానిస్టేబుల్ గా విధులు మొదలుపెట్టారు. తెలంగాణ ట్రాఫిక్ విభాగం ఎంపిక చేసిన ట్రాన్స్ జెండర్ కానిస్టేబుల్స్ నేటినుండి హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.

ట్రాన్స్ జెండర్ లకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా
ఇటీవల ప్రత్యేక నియామకం ద్వారా 39 మంది ట్రాన్స్ జెండర్ లను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి 15 రోజులపాటు ట్రాఫిక్ విధులకు సంబంధించి అధికారులు శిక్షణను ఇచ్చారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, అవుట్ డోర్, ఇండోర్ తో పాటు వాళ్ళు టెక్నికల్ అంశాల పైన వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లు నేటి నుంచి ట్రాఫిక్ కంట్రోల్ లో రంగంలోకి దిగారు.
కమాండ్ కంట్రోల్ వద్ద ట్రాన్స్ జెండర్ ల డ్రిల్
అయితే ఆదివారం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఎంపిక చేసిన ట్రాన్స్ జెండర్ లు డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ ను కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే మరింత మందిని విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీ వీ ఆనంద్ తెలిపారు.
నేటి నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్న ట్రాన్స్ జెండర్లు..!#TransGenders #TrafficAssistants #TrafficManagement #Telangana #ViralVideos pic.twitter.com/oke64kT1uX
— oneindiatelugu (@oneindiatelugu) December 23, 2024
ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లకు ఉపాధి
మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్ జెండర్లు సైతం ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications