హైదరాబాద్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్..
హైదరాబాద్ విశ్వ నగరంలో ఇప్పటికే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు నెలకుని ఉన్నాయి. భాగ్యనగర వాసులకు నిత్యం ఆహ్లాదాన్ని, సంతోషాన్ని పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు పార్కులను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్వాల్ గూడలోని ఎకో హిల్ పార్క్ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.
అన్ని సౌకర్యాలతో 85 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంది. ఈ ఎకో పార్కులోనే అతి పెద్ద పక్షి శాలను నిర్మించారు. అలాగే దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఎకో హిల్ పార్కును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సుమారు అరగంట పాటు ఎకో పార్క్ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పక్షులతో సరదాగా గడిపారు.
ఇక ఈ ఎకో హిల్ పార్కులో దాదాపు 25 జాతుల పక్షుల ప్రదర్శన శాలలు ఏర్పాటు చేశారు. అలాగే నగరవాసులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకు దాదాపు 10 లక్షల మొక్కలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పార్కును రూ.75 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. ఇక్కడ పక్షుల ప్రదర్శన శాల 4.8 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పక్షుల ప్రదర్శన శాల ఆసియాలోనే అతి పెద్ది కావడం విశేషం. వివిధ ఖండాలు అయిన ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా నుంచి తీసుకొచ్చిన 25 జాతులకు చెందిన దాదాపు 6,500 పక్షులను ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేశారు.
ఇక ఎకో హిల్ పార్కు టైమింగ్స్ విషయానికి వస్తే ఈ పార్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు రూ. 100 గా ఉంది. పక్షుల ప్రదర్శన శాలకు రూ. 150 ఎంట్రీ ఫీజుగా ఉంది. అలాగే వీకెండ్స్ లో అయితే ఎంట్రీ ఫీజు రూ. 200గా నిర్ణయించారు. అలాగే ఈ పార్కులో.. ల్యాండ్ స్కేపింగ్, ఏవియరీ, వ్యూ పాయింట్స్, 2.50 కి.మీ దూరంతో బోర్డు వాక్ ప్రాంతం, అడ్వెంచర్ జోన్ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆక్వా మైరీన్ పార్కు, ఔటర్ రింగు రోడ్డు మీదుగా ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు సస్పెన్షన్ బ్రిడ్జి ఇక లగ్జరీ రిసార్టుతో పాటు మినీ కన్వెన్షన్ సెంటర్, అలాగే ఇన్ఫినిటీ పూల్, వీటితో పాటు ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. మరి వీకెండ్ లో మీరూ ట్రై చేయండి..












Click it and Unblock the Notifications