తెలంగాణ తల్లిని అవమానించడానికే ఈడీ విచారణ.!అండగా ఉంటం.!బీజేపి ఆగడాలు సహించమన్న రేవంత్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం, భారత మాతకు ప్రతిరూపమైన సోనియాగాంధిని ఈడీ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసులివ్వడం కక్ష సాధింపు చర్యేనన్నారు టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ, రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం మొత్తం సోనియాగాందికి అండగా నిలబడ్డామని, 135 సంవత్సరాలు క్రితం దేశానికి స్వాతంత్య్రం, స్వేచ్చనివ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని గుర్తు చేసారు. రాజీవ్ హత్యానంతరం దేశం కోసం మేము సైతం ప్రాణ త్యాగాలకు సిద్ధమని సోనియా, రాహుల్ గాంధీలు బాద్యతలు స్వీకరించారన్నారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ ఈడీ విచారణ సందర్బంగా రేవంత్ సమక్షంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ప్రజోపయోగ చట్టాలు తెచ్చిన సోనియా..
2004-24 వరకు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు రేవంత్ రెడ్డి. విద్యా హక్కు చట్టం,సమాచార హక్కు చట్టం, ఆహారభద్రత చట్టం,ఉపాధిహామీ తీసుకొచ్చారని, దోచుకున్న దొంగలను శిక్షించడానికి సమాచార హక్కు చట్టం తెచ్చారన్నారు రేవంత్. సోనియా గాంధీకి దోచుకునే ఆలోచనే ఉంటే ఈ చట్టం తెచ్చే వారా అని రేవంత్ ప్రశ్నించారు. 4 కోట్ల ప్రజలు స్వతంత్రంగా బతకాలని సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. ఆత్మబలిదానాలు చూసి ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని రేవంత్ గుర్తు చేసారు.
రాంలీలా మైదానంలో తేల్చుకుందాం..
అంతే కాకుండా తెలంగాణ తల్లిని అవమానించడానికి ఈడీ ఆఫీస్ కి పిలిచారని, రాంలీలా మైదానంలో మీరో మెమో తేల్చుకుందాం నరేంద్రమోదీ అని రేవంత్ సవాల్ విసిరారు. ఈడీ ద్వారా ఇబ్బందులు వల్ల బీజేపికి రాజకీయ, మానసిక ఆనందం వస్తదా..?ఈ దేశానికి ఉక్కు మహిళ సోనియా గాంధీని పార్లమెంట్ నడుస్తుంటే ఈడీ విచారణ కు పిలుస్తారా అంటూ ధ్వజమెత్తారు. మేము పార్లమెంట్ లో గ్యాస్, జిఎస్టీ పెట్రోల్ ధరల మీద పోరాటం చేస్తుంటే పక్క దారి పట్టించడానికి ఈడీ ఆఫీస్ కి పిలిచారని, రాష్ట్రం ఇచ్చిన తల్లికి జెండాలు,ఎజెండాలు, మతాలు పక్కన బెట్టి అండగా నిలబడదామని, ఇది రాజకీయ పోరాటం కాదు,ఆత్మగౌరవ పోరాటమన్నారు రేవంత్ రెడ్డి. సోనియాగాంధీ మీద దాడి అంటే భారత మాత మీద దాడి అని, తెలంగాణ తల్లి మీద దాడి అని దీన్ని ముక్తకంఠంతో ఖండించాలన్నారు రేవంత్.
ఈడి ఆఫీసు వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా..
ఇదిలా ఉండగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో రాజకీయ కక్ష సాధింపు ఈడి విచారణకు పిలిపించిన నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడి కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా పెద్ద ఎత్తున విజయవంతం అయ్యిందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభం అయిన ప్రదర్శనలో వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని, ఈడి చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు.

కదం తొక్కిన పార్టీ శ్రేణులు..
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రదర్శనలో వేలాదిగా తరలిరావడంతో ఈ.డి కార్యాలయంలో సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు భారీగా మోహరించి భద్రత చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కార్యకర్తలను అదుపు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications