లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు..!!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న ఢిల్లీ రావాలని.. విచారణకు హాజరవ్వాలని సూచించింది. రామచంద్ర పిళ్లైను విచారించి అరెస్ట్ చేసిన ఈడీ కీలక అంశాలను వెల్లడించింది. రామచంద్ర పిళ్లై తాను కవితకు బినామీగా అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించింది. ఇప్పటికే రామచంద్ర పిళ్లైతో పాటుగా ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు కవితకు నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టింది. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 10వ తేదీన కవిత చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు నిర్ణయించారు. ఇప్పుడు అదే రోజున విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.

గత డిసెంబర్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ చేసింది. సమారు 7గంటలకు పైగా కవితను సీబీఐ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా కవిత నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. రెండు టీమ్‌లుగా వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా.. ప్రత్యేక గదిలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత అడ్వకేట్ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
ఇప్పుడు ఈడీ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత ప్రస్తావన చేసింది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించింది. ప్రేమ్‌రాహుల్‌కు కూడా 32. శాతం వాటా ఉందని తెలిపింది. ఇండోస్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌కు 35శాతం వాటా ఉన్నట్లు వివరించింది. సౌత్ గ్రూప్‌కు ఆప్ అగ్ర నేతలకు మధ్య స్పష్టమైన రాజకీయ అవగాహన ఉందని ఈడీ తెలిపింది.

అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ ఇద్దరూ కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి తరఫున బినామీలుగా పెట్టుబడులు పెట్టారని వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. కవిత మాత్రం ఈ స్కాంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు కవిత విచారణకు హాజరవుతారా..సమయం కోరుతారా..ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications