విద్యా శాఖామంత్రి ఓ దౌర్భాగ్యుడు..విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతావ్...కోమటి రెడ్డి తిట్ల దండకం

Recommended Video

    KCR పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి!! || Oneindia Telugu

    తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు . ఇంటర్మీడియట్‌ పరీక్షలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి ప్రధాని ఎట్లవుతారంటూ చురకలు అంటించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు.

     కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి .. విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతారని శాపనార్ధాలు

    కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి .. విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతారని శాపనార్ధాలు

    సీఎం కేసీఆర్ పై ఫైర్ అయిన కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతారని శాపనార్ధాలు పెట్టారు. విద్యాశాఖా మంత్రి ఓ దౌర్భాగ్యుడని తిట్టిపోశారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 48 గంటల దీక్షకు సంఘీభావం ప్రకటించిన కోమటిరెడ్డి ఐదేళ్లలో తెలంగాణ పూర్తిగా భ్రష్టు పట్టిందని వ్యాఖ్యానించారు .

     పాలన చేతగాకపోతే దిగిపోవాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    పాలన చేతగాకపోతే దిగిపోవాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    చనిపోయిన విద్యార్థి కుటుంబాలను పరామర్శించడానికి సైతం ముఖ్యమంత్రికి తీరిక లేదని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న ఆసక్తి రాష్ట్ర పాలన మీద లేదన్నారు. గ్లోబరీనా సంస్థపై మర్డర్‌ కేస్‌ పెట్టాలని, అవినీతి అధికారి అశోక్‌ను సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాలన చేతగాకపోతే దిగిపోవాలని మండిపడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన అనామిక అనే విద్యార్థిని అమ్మమ్మ కన్నీటి పర్యంతం కాగా కోమటి రెడ్డి ఆమెను ఓదార్చారు.

    విద్యాశాఖామంత్రి అసమర్ధుడు , దౌర్భాగ్యుడు అని కోమటి రెడ్డి తిట్ల దండకం

    విద్యాశాఖామంత్రి అసమర్ధుడు , దౌర్భాగ్యుడు అని కోమటి రెడ్డి తిట్ల దండకం

    ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి విజయేందర్‌రావు పైనా సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి విజయేందర్‌రావు చెరో రూ.50 లక్షలు తీసుకుని అనుభవం లేని గ్లోబరీనా కంపెనీకి కాంట్రాక్టు ఇప్పించారని ఆరోపించారు. విజయేందర్ రావు కేటీఆర్ కు బంధువని ఆయన పేర్కొన్నారు. ఇక విద్యా శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ఒక అసమర్దుడని, దౌర్భాగ్యుడని, నల్గొండ జిల్లా వాడు కావటం మరీ దురదృష్టమని ఆయనపై నిప్పులు చెరిగారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+