బంగారం కోసం.. కూతురి ఇంటి ముందు వృద్ధ తల్లిదండ్రుల ఆందోళన!

సృష్టిలో ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లల్ని నమ్ముతారు. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారని, తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటారని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు షాక్ కు గురయ్యే పనులు చేస్తున్నారు. వారి ప్రవర్తనతో తల్లిదండ్రులకు తీరని మనస్థాపాన్ని కలిగిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.

కూతురి ఇంటి ముందు వృద్ధ తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్లోని మల్కాజ్ గిరి వాణి నగర్ లో నివాసం ఉండే శివమ్మ, మల్లయ్య దంపతులు తాజాగా కూతురి ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేయడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది. ఎందుకు ఈ వృద్ధ దంపతులు కూతురి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారని తెలుసుకున్న ప్రతి ఒక్కరు అవాక్కయ్యేలా చేసింది. వాణి నగర్ లో నివసించే శివమ్మ, మల్లయ్య దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడబిడ్డ.

Elderly parents concern in front of daughter house for gold

బంగారం తీసుకుని తిరిగివ్వని కూతురు
అయితే ఇటీవల తీర్థయాత్రలకు వెళుతున్న క్రమంలో కొడుకు కోడళ్ళ బంగారం సుమారు 30 తులాలు జాగ్రత్తగా భద్రపరచమని, అదే వీధిలో నివసించే కూతురు బాలామణికి ఇచ్చామని వారు చెబుతున్నారు. తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత బంగారం అడిగితే మీరు నాకు బంగారం ఇచ్చినట్టు ఆధారం ఏముందని తమను ఇంటి నుంచి గెంటివేసిందని వృద్ధ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన
తాము ఇచ్చిన బంగారం మళ్ళీ తిరిగి తమకు ఇవ్వాలని వృద్ధ దంపతులు కూతురి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. కూతురు బాలామణి ఉపాధ్యాయురాలు కావడంతో తాను చదువు చెప్పే స్కూల్ వద్దకు వెళ్లిన ఎవరు తమ గోడు పట్టించుకోలేదని తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని అందుకే ఆందోళన చేస్తున్నామని వారు అంటున్నారు.

ఆత్మహత్య చేసుకుంటామన్న వృద్ధ తల్లిదండ్రులు
తమ బంగారం తమకు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడమే దిక్కని ఆ వృద్ధ దంపతులు ఆందోళన చేస్తున్నారు. తల్లి దండ్రులు ఎంతో నమ్మకంతో కూతురికి బంగారాన్ని ఇస్తే ఆ బంగారాన్ని తీసుకున్న కూతురు తిరిగి ఇవ్వకుండా అసలు తనకు బంగారమే ఇవ్వలేదని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. అవి కొడుకు కోడళ్ళ బంగారం కావడంతో వారు తమ బంగారం కోసం తమ పైన ఒత్తిడి చేస్తున్నారని వారు లబోదిబోమంటున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన రోజురోజుకీ కనుమరుగవుతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+