తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త: పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ(పీఆర్సీ) ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై తెలంగాణ ఆర్థికశాఖ ఈసీ అనుమతి కోరింది.
ఈ క్రమంలోనే పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, అనవసర ప్రచారం చేయరాదని, ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు కూడా ప్రయత్నించకూడదని తేల్చి చెప్పింది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్ కుమార్ లేఖ రాశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
కాగా, పీఆర్సీని త్వరలోనే తానే స్వయంగా ప్రకటిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పీఆర్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు త్వరలోనే ఆ శుభవార్త అందనుంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications