ఈఎస్ఐ కుంభకోణం : దేవికా రాణిపై ఈడీ కేసు నమోదు

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్‌‌లో ప్రధాన నిందితురాలు దేవికా రాణిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. దేవికా రాణి విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఏసీబీ వద్ద నుంచి సేకరించిన ఆమె ఆస్తుల చిట్టా ఆధారంగా కేసు నమోదు చేశారు. దాదాపు రూ.200 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఈడీ అంచనా వేస్తోంది.

దేవికా రాణి,ఆమె భర్తపై ఏసీబీ ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసింది. ఈడీతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఆ సమాచారం అందించింది. ఏసీబీ తనిఖీల్లో దేవికా రాణి భారీ ఆస్తుల చిట్టా బయటపడింది. అమరావతిలో తన పిల్లల పేరిట 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే కోట్ల విలువ చేసే బంగారం,స్థిరాస్తులు,బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను గుర్తించారు.

enforcement directorate filed a case against devika rani over esi medical scam

కాగా, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి.. లేని కంపెనీల పేరుతో అధిక ధరలకు మందులు, వైద్య పరికరాలు కొనుగోళ్లు చేసినట్టు అధికారులు గుర్తించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అర్హత లేని ఏజెన్సీల నుంచి కూడా ఆమె మందులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న ఈఎస్ఐ డైరెక్టరేట్ కేంద్రంగా ఈ స్కామ్ జరుగుతున్నట్టు 2017-18లో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా ఏడాది పాటు జరిపిన దర్యాప్తులో దేవికా రాణి
కుంభకోణం మొత్తం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+