Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IIT Hyderabad: ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రాంక్ ..! టెక్ సీఈఓకు హైదరాబాద్ ఐఐటీ విద్యార్ధి షాక్..!

ఎప్ స్టీన్ ఫైల్స్ పై భారత్ లో కలకలం రేగుతున్న వేళ ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధి ఓ టెక్ కంపెనీ సీఈవోకు పంపిన మెయిల్ వివాదాస్పదంగా మారింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎప్ స్టీన్ ఫైల్స్ చర్చే. అమెరికాతో పాటు వివిధ దేశాధినేతలు, రాజకీయ నాయకులు, అధికారులు ఇలా అందరిలోనూ ఇదే చర్చ. భారత్ లోనూ ఇప్పటికే ఎప్ స్టీన్ ఫైల్స్ పేరుతో అధికార, విపక్షాలు మాటల యుద్దానికి దిగుతున్నాయి. దీంతో ఎప్ స్టీన్ ఫైల్స్ పేరు వింటేనే చాలా మంది వణుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ టెక్ సంస్థ సీఈఓకు హైదరాబాద్ ఐఐటీ (iit hyderabad) విద్యార్థి ఒకరు పంపిన మెయిల్ కలకలం రేపుతోంది.

లెగ్గిట్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్షదీప్ రాపాల్.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి తనకు పంపిన వివాదాస్పద ఈ-మెయిల్‌ పై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సదరు విద్యార్ది తన ఉద్యోగ దరఖాస్తు మెయిల్ లో "Your name is in Epstein Files" అనే టైటిల్ పెట్టి ఈమెయిల్ పంపాడు. దాన్ని తెరిచిన వెంటనే "Hello Harshdeep, just kidding, I wanted you to open the mail" అనే సందేశం కనిపించింది. అతను ఐఐటీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థిగా తనను పరిచయం చేసుకుని, "స్మార్ట్ కాంట్రాక్ట్స్ అసిస్టెంట్" పోస్టు కోసం కోసం తన రెజ్యూమ్ పంపాడు.

Epstein Files Scare IIT Hyderabad Student Defrauds Tech Founder with Shocking Email

దీంతో లెగ్గిట్ సీఈవో హర్షదీప్ రాపాల్ ఈ మెయిల్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది వృత్తివిరుద్ధమైన చర్య అని, బిజినెస్ లీడర్స్ పట్టించుకోని ఓ "షార్ట్‌కట్" మార్గమని తేల్చేశారు. తమ కంపెనీ తీవ్రమైన న్యాయపరమైన కాంట్రాక్టులతో వ్యవహరిస్తుందని, దీనికి అధిక జవాబుదారీతనం, వృత్తి నైపుణ్యం కావాలని గుర్తుచేశారు. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇలా చేయవద్దు, సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకోండి, తాము కాంట్రాక్టుల వ్యాపారంలో పని చేస్తామని తెలిపాపరు. ఇది జవాబుదారీతనం, బాధ్యత, వృత్తి నైపుణ్యం అవసరమయ్యే తీవ్రమైన పని అన్నారు.

Epstein Files Scare IIT Hyderabad Student Defrauds Tech Founder with Shocking Email

మీకు వచ్చే మొదటి ఈమెయిల్‌లోనే అలాంటి సబ్జెక్ట్ లైన్, ప్రారంభ సందేశం ఉంటే, నేను (నిజాయితీగా చెప్పాలంటే, చాలా మంది వ్యవస్థాపకులు లేదా వ్యాపార నాయకులు) స్పందించను అని తన పోస్టులో స్పష్టం చేశారు. కాలేజ్ ప్రాజెక్టులు చేయడం, వాస్తవ బిజినెస్ టీమ్ లో పనిచేయడానికీ మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన గుర్తుచేశారు. కొన్నిసార్లు నిరాశ మనల్ని షార్ట్‌కట్‌లు తీసుకోవడానికి ప్రేరేపించవచ్చని తనకు అర్ధమైందని, అయితే ఈ పద్ధతి మీకు ఉపయోగపడదన్నారు. దీంతో లెగ్గిట్ సీఈవో పెట్టిన పోస్టు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+