Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎర్రబెల్లి వర్సెస్ సత్యవతి రాథోడ్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల ఆధిపత్యపోరు; పార్టీలో చీలికలు!!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ సత్యవతి రాథోడ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. ఒకపక్క గులాబీ బాస్ కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే, పార్టీలో మంత్రులు, నేతల తీరు మాత్రం పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల మధ్య సఖ్యత లేదన్నది స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

ఎర్రబెల్లి వర్సెస్ సత్యవతి రాథోడ్ .. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు

ఎర్రబెల్లి వర్సెస్ సత్యవతి రాథోడ్ .. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు చూస్తుంటే, సత్యవతి రాథోడ్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జిల్లాలోని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నట్లుగా స్థానికంగా చర్చ జరుగుతుంది.

 ఒకప్పుడు టీడీపీలో ఇద్దరు నేతలు; ఇప్పుడు మంత్రులుగా ఆధిపత్యం కోసం పోరాటం

ఒకప్పుడు టీడీపీలో ఇద్దరు నేతలు; ఇప్పుడు మంత్రులుగా ఆధిపత్యం కోసం పోరాటం

ఇక పార్టీ నేతలను ఏకతాటి మీద నడిపించాల్సిన ఇద్దరు మంత్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్ ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా ఉంటున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో నెలకొంది. ఒకప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులే. ఒక లెక్కలు చెప్పాలంటే దయాకర్ రావు శిష్యరికం లో సత్యవతి రాథోడ్ రాజకీయాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. జిల్లాకు ఇద్దరు మంత్రులు కావడంతో ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలను విభజించి ఇచ్చిన అధిష్టానం .. అయినా మారని నేతల తీరు

ఉమ్మడి జిల్లాలను విభజించి ఇచ్చిన అధిష్టానం .. అయినా మారని నేతల తీరు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ మంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తుంటే, తన ఉనికిని కాపాడుకోవడం కోసం సత్యవతి రాథోడ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇరువురు నేతల మధ్య పొసగడం లేదని గుర్తించిన అధిష్టానం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇన్ ఛార్జ్ గా, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు సత్యవతి రాధోడ్ ను ఇన్ ఛార్జ్ గా నియమించింది. అయినప్పటికీ వారు ఒకరు ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో మరొకరు వేలు పెడుతూ రాజకీయ గందరగోళం సృష్టిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.

రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు ..సత్యవతి వర్గంలో వీరు

రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు ..సత్యవతి వర్గంలో వీరు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో సమానంగా రాజకీయాలు నడిపిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మరికొంతమంది నేతలు మంత్రి ఎర్రబెల్లి ఆధిపత్య ధోరణిని తట్టుకోలేక మంత్రి సత్యవతి రాదోడ్ కు ప్రాధాన్యతను ఇస్తూ తమ, తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు పిలుస్తున్నట్లుగా సమాచారం.

ఎర్రబెల్లి వర్గం ఇదే ... ఇలా అయితే కష్టమే అంటున్న రాజకీయ నేతలు

ఎర్రబెల్లి వర్గం ఇదే ... ఇలా అయితే కష్టమే అంటున్న రాజకీయ నేతలు

ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ రాజయ్య, శంకర్ నాయక్, రెడ్యానాయక్... ఇతర నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయా నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ రెండుగా తయారయిందని చర్చ జరుగుతోంది. మంత్రుల తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+