వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని కావాలని కేసీఆర్ రాష్ట్రప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారా? ఈటల రాజేందర్ వ్యాఖ్యలలో అర్ధముందా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు, జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టడానికి కెసిఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు, వివిధ రాష్ట్రాల పర్యటనలు, వివిధ రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందడం కోసం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా బిజెపి తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలోనే బిజెపి నేతలు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ ప్రధాని కావాలన్న ఆశతో ఇతర రాష్ట్రాల రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కెసిఆర్ ఇతర రాష్ట్రాల రైతులకు నష్టపరిహారం ఇస్తున్న సొమ్ము తెలంగాణ ప్రజలది కాదా అంటూ ఈటల రాజేందర్ నిలదీశారు. కెసిఆర్ తీరుతో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతుందని, ఇక్కడి రైతులను పట్టించుకోని ప్రభుత్వాధినేత, పక్క రాష్ట్రాల రైతులకు ఇక్కడి ప్రజల డబ్బులను పంచుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్.

ఓటమి భయంతోనే పీకే ని రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు

ఓటమి భయంతోనే పీకే ని రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని తెలంగాణ సర్కార్ 250 కోట్ల రూపాయలను వెచ్చించి ఇతర రాష్ట్రాలలో ప్రకటనలు ఎలా ఇచ్చిందంటూ ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలోని పార్టీకి విజయావకాశాలు తక్కువగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నాడి తెలిసిన కేసీఆర్ కు పీకే అవసరం ఎందుకు వచ్చిందంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

తెలంగాణా రైతాంగాన్ని పక్కనబెట్టి దేశంలోని రైతులకు తెలంగాణా ప్రజల సొమ్మా? చర్చ

తెలంగాణా రైతాంగాన్ని పక్కనబెట్టి దేశంలోని రైతులకు తెలంగాణా ప్రజల సొమ్మా? చర్చ


తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి, రాష్ట్ర ప్రజల సొమ్మును సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఖర్చు చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి రైతులను ఆదుకోకుండా, కెసిఆర్ పక్క రాష్ట్రాల రైతాంగానికి సహాయం చేయడానికి వెళ్లడం కేవలం జాతీయ రాజకీయాల కోసమేనని చాలామంది ప్రజలు సైతం భావిస్తున్నారు.

 ఈటల వ్యాఖ్యలపై తెలంగాణా ప్రజల ఆసక్తి.. ఆయన మాటల్లో అర్ధం ఉందని చర్చ

ఈటల వ్యాఖ్యలపై తెలంగాణా ప్రజల ఆసక్తి.. ఆయన మాటల్లో అర్ధం ఉందని చర్చ

ఏది ఏమైనా కేసీఆర్ వ్యూహాలు బాగా తెలిసిన ఈటల రాజేందర్ బిజెపి లోకి వచ్చిన తర్వాత కెసిఆర్ తీరుపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో, ప్రజలలోఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ఎవరికీ అర్ధం కాకుండా కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వెనుక అసలు కారణాలు ఈటల రాజేందర్ చెప్పటం తెలంగాణా ప్రజల దృష్టిని ఈటల వైపు ఆకర్షించేలా చేస్తుంది. ఆయన వ్యాఖ్యల్లో అర్ధం వుంది అన్న చర్చ జోరుగా సాగుతుంది.

English summary
Is KCR misusing the money of the people to become the Prime Minister? The debate over whether it makes sense in Rajender's remarks is raging in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X