సీఎం రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సీరియస్ అల్టిమేటం!
గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఇందుకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని ఆయన తెలిపారు. వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అభివృద్ధికి బిజెపి వ్యతిరేకం కాదు
రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం పట్టించుకోవడంలేదని విమర్శలు గుప్పించారు. అభివృద్ధికి బిజెపి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు .తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఈటల రాజేందర్ తెలిపారు. భూసేకరణ కోసం కలెక్టర్లతో కమిటీ వేసి ప్రాంతాలవారీగా వాస్తవ ధరలు నిర్ణయించాలని, ఆ నివేదికను కేంద్రానికి పంపాలని, కేంద్రంపై అపవాదు వేయడం సమంజసం కాదన్నారు.

సమగ్ర సర్వే చేసి ఎక్కువ ధరలు ఇవ్వాలన్న ఈటల
రైతుల పట్ల ప్రేమ ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అన్నారు. ఎన్ని కోట్లు అయినా ఇస్తామని గడ్గరీ చెప్పారని, రైతులు సంతోషంగా భూములు ఇచ్చేలా ఉండాలని ఆయన అన్నారు. హెచ్చరిక చేస్తున్న సమగ్ర సర్వే చేసి ఎక్కువ ధరలు ఇవ్వాలని ఈటల పేర్కొన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రైతాంగం పక్షాన పాదయాత్ర చేస్తామని, మెడలు వంచి డబ్బులు ఇప్పిస్తామని తెలిపారు.
కేసీఆర్ మాటలోనే కాంగ్రెస్ కూడా
అవసరమైతే అన్నదాతల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి పోతే సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. విద్య వ్యవస్థలను కేసీఆర్ బ్రష్టు పట్టించారన్నారు. అదే తరహాలో కాంగ్రెస్ నడుస్తోందన్నారు. బి ఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతోంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీసీ కుల గణనకు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ డ్రామా కంపెనీకి వ్యతిరేకం
బీసీ కుల గణనకు బిజెపి వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్ డ్రామా కంపెనీకి వ్యతిరేకమన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుల గణనకు చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్ని పనుల పైన లెక్క చెప్పే రోజు వస్తుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications