నిమజ్జనానికి ఏపీ పోలీసులు: '33 ఏళ్ల తర్వాత గణేష్ నిమజ్జనం, బక్రీదు ఒకేసారి'
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం, బక్రీదు పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఘట్‌కేసర్‌లోని ఏదులాపురం చెరువును, యనంపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టును ఆయన సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 సంవత్సరాల తర్వాత గణేష్ నిమజ్జనం, బక్రీదులు ఒకేసారి వచ్చాయన్నారు. ముందు జాగ్రత్తతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా ఉండేందుకు సైబరాబాద్ పరిధిలో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విగ్రహాల ప్రతిష్ట కోసం అధికంగా అనుమతులు వచ్చాయన్నారు. గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 25 చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. తద్వారా 10,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందన్నారు. గణేష్ నిమజ్జనం జరిగే చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏపీ పోలీసులు
హైదరాబాద్‌లో జరిగే గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏపీ పోలీసు సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు. ఈ మేరకు సిబ్బందిని కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 1761 మంది పోలీసు సిబ్బందిని నిమజ్జనోత్సవానికి కేటాయించారు. ఈ మేరకు ఏపీ శాంతిభద్రతల అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications