కాంగ్రెస్ లోకి మాజీ హోం మంత్రి - కీలక హామీ..!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. ఈ సమయంలో ఇతర పార్టీ నాయకుల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సీనియర్ లీడర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్‌తో కాంగ్రెస్ నేతలు మంతనాలు ప్రారంభించారు. పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దేవేందర్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లో చేరికలు
తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతున్నాయి. బీజేపీలో చేరిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, వివేక్ తిరిగి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్దులు గా పోటీ చేస్తున్నారు. తాజాగా విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసారు.

Ex minister T Devender Goud likely to join in Congress soon as party leaders Invitation

ఇక, ఇప్పుడు మాజీ మంత్రులు..ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి దేవేందర్‌ గౌడ్ కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాస్కి గౌడ్ దేవేందర్ ‌గౌడ్‌తో భేటీ కావడం ఆసక్తి కరంగా మారుతోంది.

దేవేందర్ గౌడ్ తో చర్చలు
కొంత కాలం క్రితం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం దేవేందర్ గౌడ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఏడాది జులై 18న దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన తనయులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్‌లను రేవంత్ కలుసుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతన్న వీరేందర్ గౌడ్‌తో సహా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో దేవేందర్ గౌడ్ తెలుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

చంద్రబాబు హయాంలో రెవిన్యూ, హోం మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేదంటూ 2008లో ఆ పార్టీకి రాజీనామా చేసి, నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి చవిచూశారు. మరోసారి తెలంగాణ టీడీపీలో చేరి, కొంతకాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

ఎన్నికల వేళ ఆహ్వానాలు
అనారోగ్య కారణాలతో దేవేందర్ గౌడ్ చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తెలుగు దేశం పార్టీ వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది.

అయితే ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ ఒక్కరే కషాయ కండువా కప్పుకున్నారు. దేవేందర్ గౌడ్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కానీ, క్రియాశీలంగా లేకపోవటంతో ఆయన్ను కాంగ్రెస్ లోకి రావాలని తాజా మధుయాష్కీ కోరినట్లు సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తారని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీని పైన దేవేందర్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నా..అధికారికంగా నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+