Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్‌లో ద్రోహులు.! కార్యకర్తలే వారి పని పట్టాలి.. మీ ముందుకు వస్తున్నా..!! : తుమ్మల సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో కొందరిని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కాని .. రాజకీయ ద్రోహులను మాత్రం నమ్మకూడదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంతపార్టీలో వారినే లక్ష్యంగా చేసుకుని తుమ్మల చేసిన వ్యాఖ్యల‌తో టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత కొంత కాలంగా సైలైంట్‌గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఈ కీలక వ్యాఖ్యాలు చేశారు.

రాజకీయ ద్రోహులను నమ్మొద్దు

రాజకీయ ద్రోహులను నమ్మొద్దు

ఖమ్మంజిల్లా , నేలకొండపల్లి మండలం, చెరువు మాదారంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన తుమ్మల రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ.. రాజకీయ ద్రోహులను నమ్మొద్దన్నారు. రాజకీయ శత్రువులంటే వారి పార్టీకి వాళ్లు ఓట్లేసుకుంటారు. కానీ రాజకీయ ద్రోహులు సొంత పార్టీలో ఉంటూ పక్క పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఓట్లు వేస్తారని విరుచుకుపడ్డారు. ఆ రాజకీయ ద్రోహుల సంగతి మీరే చూసుకోవాలని కార్యకర్తలకు తుమ్మల పిలుపునిచ్చారు. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తున్నా అంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

మళ్లీ మీ ముందుకు వస్తున్నా..

మళ్లీ మీ ముందుకు వస్తున్నా..


పాలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంచేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తుమ్మల తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా అభివృద్ధితోపాటు పాలేరును అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజలు తనకు ఇచ్చిన అపూర్వ స్వాగతానికి జన్మజన్మల రుణపడి ఉంటానని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మిగిలి ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో ఏపనులు ఆగినా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులను చేయిస్తున్నట్లు తెలిపారు.

 పాలేరు నుంచి పోటీ?

పాలేరు నుంచి పోటీ?


2018 ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న హామీతోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సమాచారం . అయితే ఇదే స్థానం నుంచి తానే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని కార్యకర్తలకు తుమ్మల బహిరంగంగానే చెప్తున్నారు. ఈనేపథ్యంలో తుమ్మల పాలేరులో విసృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశేమవుతున్నారు. తుమ్మలకు సీఎం కేసీఆర్ అభయం ఇచ్చారా? లేదా..? ఇస్తే మరి ఎమ్మెల్యే కందాల పరిస్థితి ఏమిటి ? అన్న దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+