బీజేపీ, కాంగ్రెస్ టచ్ లో; టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకున్నా పోటీచేస్తా: మాజీ ఎంపీ సంచలనం
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నేతలు అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు ఖమ్మం జిల్లా గులాబీ పార్టీపై చర్చకు కారణంగా మారాయి.

ఎన్నికల్లో టికెట్ అంశంపై ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో జరిగిన కార్యక్రమాలకు హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను గులాబీ తోటలోనే ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తోటలో తనకు పువ్వు దొరుకుతుందా లేదా అనేది చూడాలంటూ వచ్చే ఎన్నికల్లో టికెట్ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నారని, పదవి లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

టీఆర్ఎస్ నుండి టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తా
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని, తాను ఆయన నుండి ఎలాంటి రాజకీయ సలహాలు తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో ఇప్పటివరకు తనకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుందని తాను ఆశిస్తున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

ఢిల్లీ కాంగ్రెస్, బీజేపీ పెద్దలు టచ్ లో ఉన్నారు
ఇప్పటికే తనతో ఢిల్లీ బిజెపి, కాంగ్రెస్ పార్టీల పెద్దలు టచ్లో ఉన్నారని పేర్కొన్న ఆయన, ఎన్ని ముల్లు గుచ్చుకున్న గులాబీ తోటలోనే ప్రయాణిస్తా అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో ప్రజల తీర్పు ను వదులుకునేది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.
Recommended Video

పొంగులేటి వ్యాఖ్యలతో ఖమ్మం గులాబీలలో ఆసక్తికర చర్చ
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి రేగా కాంతారావుకు మధ్య, స్థానికంగా ఉండే పార్టీ ముఖ్య నేతలకు మధ్య పొసగటం లేదు . దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో లేరు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో అధిష్టానం కూడా సైలెంట్ గా ఉండటంతో ఆయనను పొమ్మనకుండా పొగ పెట్టారని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇక ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలను ఇట్టే అర్థమయ్యేలా చెబుతున్నాయి.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications