కల్లాల కాడనే కాటికి పోతున్న రైతులు.!పట్టించుకోని కేసీఆర్.!మరోసారి నిప్పులు చెరిగిన షర్మిళ.!
హైదరాబాద్ : వరి వేస్తే ఉరేనన్న మాటలను సీఎం చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్నాడని వైసీపి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. యాసంగి పంటను కొనకుండా కల్లాల కాడనే రైతులను కాటికి పంపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. రెండు నెలలైనా వడ్లు కొంటలేరని, రోడ్లపై పడి ధర్నాలు చేస్తున్నా, ఐకేపీ సెంటర్ల ముందే పారబోసి ధాన్యాన్ని కాలబెడుతున్నా.. దొరకు చీమ కుట్టినట్లైనా లేదనన్నారు షర్మిళ.
రైతులు అరిగోస పడుతున్నా.. ఒక రివ్యూ కూడా నిర్వహించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా ధాన్యం కొంటలేరని రైతన్నలు సహనాన్ని వ్యక్తం చేస్తుంటే, ఒక మంత్రి తాలు కాలబెట్టి నాటకాలా అంటూ అపహస్యం చేస్తున్నారని షర్మిళ మండిపడ్డారు. మరో మంత్రి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొని రికార్డ్ బద్దలు అంటూ జబ్బలు చర్చుకుంటున్నడని షర్మిళ ఎద్దేవా చేసారు.

అంతే కాకుండా 1.30 లక్షల టన్నుల ధాన్యం పండితే సగం కొనక పోవడం రికార్డ్ అంటరా..?అని షర్మిళ నిలదీసారు. మంత్రి చెప్పిన ప్రకారం 80 లక్షల టన్నులకు 50 లక్షల టన్నులు కొనడం గొప్ప విషయమా..? అని ప్రశ్నించారు. రెండు నెలల్లో 50 లక్షల టన్నులు కొన్న ప్రభుత్వం, వారం రోజులో రానున్న వర్షాకాలానికి 30 లక్షల టన్నులు కొనగలరా..? అంతా పచ్చి అబద్ధాలు..బూటకపు మాటలు అంటూ షర్మిళ ధ్వజమెత్తారు. ధాన్యం కొనడం చేతకాక, రికార్డులు అని భజన చేయడం ఒక్కటే గులాబీ నేతలకే చెల్లిందని, రికార్డుల సర్కారు కాబట్టే 9 ఏళ్లలో 9 వేల మంది రైతులను బలి తీసుకోవడం గులాబీ పార్టీకి రికార్డ్ కాక ఇంకేమవుతుందన్నారు షర్మిళ.













Click it and Unblock the Notifications