కొడంగల్‌లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీ, ముగ్గురి మృతి
తెలంగాణలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొని ముగ్గురు మృతి చెందిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వికారాబాద్ జిల్లా కొడంగల్ లోని ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కర్ణాటకలోని గనుగాపూర్‌లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో బయలుదేరి వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వస్తుండగా.. చిట్లపల్లి-యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

బొలెరో వాహనం ఎదురుగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మృతదేహాలను కొండగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి మరణవార్తతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications