నిపా భయం?: రోగులతో కిక్కిరిసిపోయిన నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి..
హైదరాబాద్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. రక్త పరీక్షల కోసం రోగులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లో రెండు నిపా అనుమానిత కేసులు నమోదు కావడంతో.. చాలామందిలో భయాందోళన నెలకొంది.
సాధారణ జ్వరానికి కూడా నిపా సోకిందేమోనన్న ఆందోళనతో రక్త పరీక్షల కోసం ఆసుపత్రికి పరిగెత్తుతున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా ఫీవర్ ఆసుపత్రికి పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

సోషల్ మీడియాలో నిపా వైరస్ గురించి వైరల్ అవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువైనట్టు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వాస్పత్రుల్లో నిపా అనుమానిత కేసుల కోసం ప్రత్యేక వార్డులు చేశారు.












Click it and Unblock the Notifications