కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేయ‌నున్న సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్‌..

సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున నిర్మాత బండ్ల గ‌ణేష్ పోటీచేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బండ్ల గ‌ణేష్ కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే, కాంగ్రెస్ టికెట్‌ కోసం బండ్ల గణేశ్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం బండ్ల గ‌ణేష్‌ పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతల్లో వినిపిస్తున్నా స‌మాచారం. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మొద‌ల‌య్యింది. మరికొద్ది రోజుల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం కూడా ఉంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో బిఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Congress Party Logo

నేడు అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేసే అవ‌కాశం: అయితే కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు ఇప్ప‌టివ‌ర‌కూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. వ‌చ్చే రెండుమూడు రోజుల్లో ఈ రెండు పార్టీలు కూడా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే, తాజాగా అందిన స‌మాచారం ప్రకారం నేడు జ‌రిగే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 60 నుంచి 80 స్థానాల అభ్యర్థుల‌ను ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్త కొంద‌రు కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేసింది. అయితే, లిస్టులో ఎవ‌రి పేరు ఉంటుందా? ఉండ‌దా అనే సందిగ్ధానికి నేటితో తెర‌ప‌డనుంది.

 Film producer Bandla Ganesh who will contest as Congress candidate..

పోటీపై బండ్ల గ‌ణేష్ స్పంద‌న‌: అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసే విష‌యంపై నిర్మాత బండ్ల‌గ‌ణేష్ ఆదివారం నాడు స్పందించారు. కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారా? లేదా అనే విష‌యంపై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీచేయ‌డం లేదంటూ షాక్ ఇచ్చారు నిర్మాత బండ్ల‌గ‌ణేష్‌. కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు అని వ‌స్తున్న ప్ర‌చారాల‌పై ఆయ‌న ట్వీట్ చేశారు.

పోటీ చేయ‌డం లేదంటూ క్లారిటీ ఇచ్చేసారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేదంటూ, టీపీసీసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న‌కు అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పార‌ని, కానీ త‌న‌కు టిక్కెట్ వ‌ద్దు, కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డ‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని..అందుకు త‌నవంతుగా కృషి చేస్తాన‌ని సోష‌ల్‌మీడియాలోని త‌న ఖాతాలో పేర్కొన్నారు. రేవంత‌న్న మీ ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. టికెట్ కోసం కూడా నేను ఎటువంటి ద‌ర‌ఖాస్తు చేసుకోలేదు. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం.. అంటూ బండ్ల గణేష్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+