రవీంద్ర భారతిలో అగ్ని ప్రమాదం: చెలరేగిన మంటలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని సాంస్కృతిక కళావేదిక రవీంద్ర భారతిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ప్రధాన వేదిక వద్ద విద్యుత్ షాక్‌తో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.

ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రధాన వేదిక వద్ద ఉన్న వైర్లు, లైట్లు, స్పీకర్లు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Fire breaks out in iconic Ravindra Bharathi auditorium

భవనం లోపల దట్టంగా పొగలు అలుముకున్నాయి. రవీంద్ర భారతి ప్రాంతంలో ఊపిరాడక పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Fire broke out in the iconic Ravindra Bharathi auditorium, the major cultural centre in the city today. Lighting sets, mikes and other equipment on the main stage were gutted in the fire which broke out due to electric short circuit.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి