Telangana: రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ఈ హోటళ్లు, రెస్టారెంట్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మొన్నటి వరకు హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు రెస్టారెంట్లు, హోటళ్లు అనేక అంశాలను గుర్తించారు. నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఫుడ్ సెఫ్టీ అధికారులు జిల్లాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మండి రెస్టారెంట్ ఏర్పాటుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు. FoSCoS యాప్‌లో నమోదైన ఫిర్యాదుల మేరకు సోదాలు చేశారు. సిద్దిపేటలోని పొన్నాల రెస్టారెంట్‌లో జరిపిన తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. వంటగది ఆవరణలో అపరిశుభ్రంగా ఉండడం, చెత్తకుండీలు లేకుండా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Food safety officials conducted inspections in many restaurants in the state

వడ్డించే సిబ్బందికి చేతి గ్లౌజ్ లేవని గమనించారు. ముడి, పాక్షికంగా తయారుచేసిన ఆహార పదార్థాలను నేరుగా నేలపై ఉంచడం వల్ల కలుషితమై ప్రమాదం ఉందన్నారు. FSS చట్టం, 2006 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మండి, ఇతర రెస్టారెంట్లతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, హాస్టళ్లలో కూడా ఇటీవల దాడులు నిర్వహించారు.

ఈ తనిఖీల సమయంలో వంటగది సిబ్బందికి సరైన ప్రోటోకాల్‌లు, ఆహార తయారీలో అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతుల గురించి అవగాహన కల్పించారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించేలా గత కొన్ని నెలలుగా టాస్క్‌ఫోర్స్ వివిధ రెస్టారెంట్లు, పీజీలు, హాస్టళ్లపై దాడులు నిర్వహిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+