చంద్రబాబుకు షాక్: టిఆర్ఎస్ లో చేరిన రమేష్ రాథోడ్
తెలంగాణ టిడిపికి చెందిన మరో కీలకనేత ఆ పార్టీని వీడారు.విశాఖలో మహానాడు జరుగుతున్న సమయంలోనే పార్టీకి రాజీనామాచేసి టిఆర్ఎస్ లోచేరారు.
హైదరాబాద్: తెలంగాణ టిడిపికి చెందిన మరో కీలకనేత ఆ పార్టీని వీడారు.విశాఖలో మహానాడు జరుగుతున్న సమయంలోనే పార్టీకి రాజీనామాచేసి టిఆర్ఎస్ లోచేరారు. ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ టిడిపికి గుడ్ బై చెప్పారు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ టిడిపికి రాజీనామా చేశారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్ లోచేరారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు నచ్చడంతో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరినట్టు చెప్పారాయన. తనతో పాటు టీడీపీ క్యాడర్ కూడ టిడిపి నుండి బయటకు వచ్చిందని ఆయన చెప్పారు.

ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు నచ్చడంతో పాటు పార్టీ మారినట్టు ఆయన చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తనకు ఆప్తమిత్రుడని రమేష్ రాథోడ్ చెప్పారు. అయితే రమేష్ రాథోడ్ పార్టీలో చేరేందుకు తుమ్మల నాగేశ్వర్ రావు మధ్యవర్తిత్వం వహించాడు.
2019 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉట్నూర్ లేదా ఖానాపూర్ నుండి రమేష్ రాథోడ్ పోటీచేసేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.మహనాడు జరుగుతున్న సమయంలోనే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీని ఇబ్బందుల్లో నెట్టింది.












Click it and Unblock the Notifications