బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి కన్నుమూత; కార్యకర్తలకు ఆయన ప్రేరణ.. పీఎం మోడీ సంతాపం

బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యే గా విశేష సేవలందించిన చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆసుపత్రికి తరలించిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో జంగారెడ్డి కుటుంబంలోనే కాకుండా, వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

జంగారెడ్డి మృతిపై ప్రధాని మోడీ సంతాపం

జంగారెడ్డి మృతిపై ప్రధాని మోడీ సంతాపం

భారతీయ జనతా పార్టీకి ఎంతో సేవ చేసిన, పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన సీనియర్ నాయకుడు జంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సంతాప ప్రకటనను విడుదల చేశారు. జన సంఘ్, బీజేపీని విజయశిఖరాలకు తీసుకు వెళ్లడంలో మాజీ ఎంపీ జంగారెడ్డి విశేష కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుర్తుచేసుకున్నారు.

జంగారెడ్డి ఎంతోమంది కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారన్న మోడీ

జంగారెడ్డి ఎంతోమంది కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారన్న మోడీ

ఎందరో ప్రజల మనసుల్లో జంగారెడ్డి స్థానం సంపాదించుకున్నారని, ఆయన ఎంతో మంది కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆయన మృతి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే బిజెపి సీనియర్ నాయకుడు జంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని వారు అభివర్ణించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జంగా రెడ్డి పార్ధివ దేహం.. నాయకుల నివాళులు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జంగా రెడ్డి పార్ధివ దేహం.. నాయకుల నివాళులు

జంగారెడ్డి పార్థివదేహాన్ని కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్ నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. పార్టీ కార్యకర్తలు నాయకులు జంగారెడ్డి పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. వరంగల్ జిల్లా పరకాల కు చెందిన చందుపట్ల జంగారెడ్డి విషయానికి వస్తే ఆయన నవంబర్ 18 1935 సంవత్సరంలో జన్మించారు.1953 సంవత్సరంలో సుధేష్ణ ను వివాహం చేసుకున్నారు. జంగారెడ్డి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన హనుమకొండలో నివాసముంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు జంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్ గా పనిచేశారు .

మాజీ ప్రధాని పీవీని ఓడించిన నేత జంగారెడ్డి ... వరంగల్ బీజేపీలో విషాదం

మాజీ ప్రధాని పీవీని ఓడించిన నేత జంగారెడ్డి ... వరంగల్ బీజేపీలో విషాదం

1984 లో బిజెపి నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీల లో జంగారెడ్డి ఒకరు. అప్పట్లో హనుమకొండ పార్లమెంటు స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై జంగా రెడ్డి విజయం సాధించారు. నాడు గెలిచిన ఎంపీగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసి వరంగల్ జిల్లా పార్టీ రాజకీయాలలో కీలక భూమిక పోషించిన జంగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని వరంగల్ జిల్లా బిజెపి నేతలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కును కోల్పోయామని బాధపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+