పచ్చి బూతులు బాబోయ్.. మానకొండూర్ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైర్ !!
కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో మానకొండూరు నియోజకవర్గం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. రసమయి, కవ్వంపల్లి ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఈసారి ఏకంగా బూతులతో రెచ్చిపోయారు.
ఆడియో లీక్..
ఇన్నాళ్లు మాటల యుద్ధానికే పరిమితమైన వీరి మధ్య వివాదం.. ఇప్పుడు ఏకంగా బూతులతో కూడిన అసభ్య ఆడియో లీక్ కావడం తీవ్రచర్చనీయాంశంగా మారింది. ఆ ఆడియోలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పదజాలంతో విరుచుకుపడినట్లు వినిపిస్తోంది. అందులో మాట్లాడుతూ.. పది సంవత్సరాల కాలంలో నీ పని తనం నా పనితనం చూసుకుందాం. చిల్లర మాటలతో నన్ను రెచ్చగొడుతున్నావు అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బూతులు కూడా ఉండడంతో ఆడియో వైరల్ గా మారింది.

ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత, మానకొండూరు ప్రాంతంలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రసమయిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు, రసమయి దిష్టి బొమ్మలు దహనం చేశారు. దీనిపై కవ్వంపల్లి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రసమయిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రసమయి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా రసమయి, కవ్వంపల్లి మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. రసమయి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కవ్వంపల్లి తరచూ విమర్శల వర్షం కురిపించేవారు. ఇక ఆయన మాజీ అయిన తర్వాత కవ్వంపల్లిపై ఫైర్ అవుతూ వస్తున్నారు. అందులో భాగంగానే రసమయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆటలు, పాటలు తప్ప అభివృద్ధి ఏమీ కనిపించలేదు.. పదేళ్లలో ఆయన చేసిన పని చూపించలేడు
అంటూ ఘాటు కవ్వంపల్లి ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు కౌంటర్ గా కమిషన్‌ల నారాయణ! మేము తెచ్చిన నిధులతో రోడ్లు పూర్తి చేయలేదని.. 18 నెలల్లో సాధించినది పోస్టర్ల ప్రచారం తప్ప ఏమీ లేదని రసమయి బదులిచ్చారు.
మొత్తానికి ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు రాజకీయ చేసుకోవడం ఏంటని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రసమయి, కవ్వంపల్లి ఇకనైనా వీటికి స్వస్తి పలికి తమ ప్రాంత అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications