దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న మల్లారెడ్డి
మాజీ మంత్రి మల్లారెడ్డి అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ సరదాగానే ఉంటారు. ఆయన మాటలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా, దుబాయ్‌లో పర్యటిస్తున్న మల్లారెడ్డి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో పారాగైడ్లింగ్ చేస్తూ హల్చల్ చేసిన మల్లారెడ్డి.. ఇప్పుడు దుబాయ్‌లో పర్యటిస్తూ అక్కడి షేక్ అవతారంలో కనిపించి సందడి చేశారు.
దుబాయ్ పర్యటనలో ఉన్న మల్లారెడ్డి.. ఎడారిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ టేరౌైన్ వెహికిల్‌ను మల్లారెడ్డి ఉత్సాహంగా నడుపుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల తర్వాత రిలాక్స్ అయ్యేందుకు విహార యాత్రలు చేస్తున్న మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయనతోపాటు పలువురు పార్టీ నేతలను కూడా తీసుకెళ్లారు. గతంలో మంత్రిగా ఉన్నా.. ఇప్పుడు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నా మల్లారెడ్డి మాత్రం తన వ్యవహార శైలిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ నేతలతో కలిసి మల్లారెడ్డి దుబాయ్‌కి వెళ్లారు. అక్కడున్న తెలుగువారితో ముచ్చటిస్తూ.. అక్కడి అందాలను అస్వాదించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దుబాయ్ వెళ్లి జీవనోపాది పొందుతున్న కార్మికులతో మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
దుబాయ్ విహార యాత్రలో మాజీ మేడ్చల్
— HEMA (@Hema_Journo) January 18, 2024
ఏమ్మెల్యే @chmallareddyMLA pic.twitter.com/rOoFntrA1s
ఆ తర్వాత దుబాయ్ ఎడారిలో ఆల్ టేరైన్ వెహికిల్ రైడ్ చేశారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన దుబాయ్ షేక్ అవతారంలో కనిపించడం గమనార్హం. ప్రస్తుతం మల్లారెడ్డి దుబాయ్ టూర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మల్లన్న అంటే ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications