బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..కీలక నేత గుడ్ బై
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీఆర్ఎస్ (BRS) పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం ఆయన తన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. ఈ రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వరుస పరిణామాలతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన
గువ్వల బాలరాజు రాజీనామా బీఆర్ఎస్ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టింది. ఇప్పటికే పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యతిరేక స్వరం వినిపిస్తుండటం, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటం గులాబీ నేతలను కలవరపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కీలకమైన గువ్వల బాలరాజు రాజీనామా చేయడం పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పరిణమించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ రాజీనామాపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications