కేసీఆర్ ఝలక్ ఇస్తే.. మాజీ ఎంపీ పొంగులేటి ఏకంగా బిగ్ షాక్? ముహూర్తం ఫిక్స్!!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కెసిఆర్ ఇచ్చిన ఝలక్ కు ఆయన రివర్స్ షాక్ ఇవ్వబోతున్నారా? ఆయన కారు దిగి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? సంక్రాంతి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. త్వరలో ఆయన పార్టీ మారుతున్నారని తాజా పరిణామాలతో బి ఆర్ ఎస్, బీజేపీ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతుంది.

వచ్చే ఎన్నికలపై తేల్చమన్న పొంగులేటికి కేసీఆర్ ఝలక్

వచ్చే ఎన్నికలపై తేల్చమన్న పొంగులేటికి కేసీఆర్ ఝలక్

ఖమ్మం జిల్లాలో గులాబీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ముదిరి పాకాన పడింది. చాలా కాలంగా గులాబీ పార్టీపై తీవ్ర అసహనం తో ఉన్న ఆయన తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం అభిమానులు, కార్యకర్తలతో భారీ బల ప్రదర్శన నిర్వహించి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పై తేలుస్తారా తెల్చుకోమంటారా అంటూ బీఆర్ఎస్ అధిష్టానానికి తనదైన సంకేతాలు పంపించారు. అందుకు ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు భద్రతను తగ్గిస్తూ ఝలక్ ఇచ్చింది. కంట్రోల్లో లేకపోతే మునుముందు తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుంది అన్న సంకేతాన్ని పంపింది.

గులాబీ బాస్ పై పొంగులేటి పోరాటం

గులాబీ బాస్ పై పొంగులేటి పోరాటం

ఇక దీనిపై స్పందించని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. 2018 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతున్నప్పటికీ ఆయనకు పార్టీలో సరైన స్థానం ఇవ్వడం లేదని పదేపదే ఆయన అసహనం వ్యక్తం చేస్తూనే వచ్చారు. గత ఎన్నికల సమయంలో ఆయన గులాబీ బాస్ టికెట్ ఇచ్చిన వారిని కాకుండా తన వర్గం వారిని గెలిపించుకోవడంతో ఖమ్మం జిల్లాలో పార్టీకి తీరని నష్టం జరిగిందని, అప్పటి నుంచే పొంగులేటిపై తీవ్ర అసహనంతో ఉన్నారని అందుకే పొంగులేటిని పక్కన పెట్టారని సమాచారం. అప్పటినుంచి చాలా విషయాలలో పార్టీతో విభేదించి, పార్టీలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోరాటం చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భద్రత తగ్గించి గులాబీ బాస్ హెచ్చరిక జారీ చేశారు.

పొంగులేటి బీజేపీ బాట ?

పొంగులేటి బీజేపీ బాట ?


దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో బిజెపి బాట పట్టాలని ఆలోచిస్తున్నట్లుగా, ఈ మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఇక ఖమ్మంలో రాజకీయాలపై సీరియస్ గా ఉన్న పొంగులేటి ఇప్పటికే జిల్లాలో రహస్యంగా సర్వే చేయించి ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తాను ఏ పార్టీలోకి వెళితే తన భవిష్యత్తు బాగుంటుంది అన్న అంశం పైన అన్ని వివరాలు సేకరించినట్లు గా తెలుస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో వచ్చేఎన్నికలలో టికెట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ అధిష్టానం ముందు ప్రతిపాదనలు పెట్టిన పొంగులేటి తాను ఖమ్మం లేదా కొత్తగూడెం నుండి పోటీ చేస్తానని ఇక తన వర్గానికి పినపాక, సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట , ఇల్లందులో అవకాశం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై అక్కడి నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది.

సంక్రాంతి తర్వాత పొంగులేటి పార్టీ మార్పు ఫిక్స్?

సంక్రాంతి తర్వాత పొంగులేటి పార్టీ మార్పు ఫిక్స్?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బిజెపిలో ఆయన త్వరలో చేరుతారు అన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. తాను బీజేపీలోకి వెళితే తనతోపాటు తన అనుచరులకు కూడా టికెట్లు వస్తాయని భావిస్తున్న క్రమంలో పొంగులేటి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారడానికి చాన్స్ ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా సంక్రాంతి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలలో సంచలన నిర్ణయం తీసుకొని గులాబీ బాస్ కి షాక్ ఇవ్వడం ఖాయమన్న సంకేతాలు పంపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+