ఆ ఛాన్స్ లేదు.. పూరికి ఆ అవసరం ఉండకపోవచ్చు!, ఎందుకంటే?: మాజీ పోలీస్ బాస్
ఒక కథనో.. ఐడియానో అమ్ముకుంటే కోట్ల రూపాయలు ఆయన ఖాతాలోకి వెళ్తాయి. అలాంటి వ్యక్తి.. కేవలం లక్షల రూపాయల కోసం కక్కుర్తి పడి డ్రగ్స్ దందా చేశారనడం నమ్మశక్యం కాదన్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూ 'డ్రగ్స్' వివాదం రక్తి కడుతోంది. కెల్విన్‌తో లింకులు బయటపడటం.. గతంలో పూరి నుంచి అతనికి చెక్కులు కూడా అందడం ఆయనపై ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అయితే ఇండస్ట్రీలోని ఇతరులకు కూడా పూరి డ్రగ్స్ ఇచ్చారన్న ఆరోపణలు ఉండటంతో.. డ్రగ్స్ దందా ఏమైనా కొనసాగుతోందా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. దీనిపై స్పందించిన మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు అధికారికంగానే రూ.3కోట్ల దాకా తీసుకునే వ్యక్తికి డ్రగ్స్ దందా నడపాల్సిన అవసరముంటుందని తాను భావించడం లేదన్నారు. ఆయన డ్రగ్స్ తీసుకుంటే తీసుకుని ఉండవచ్చు గానీ దాన్నే ఓ వ్యాపారంగా మలుచుకుంటారన్న వాదన అర్థరహితం అన్నట్లుగానే ఆయన వ్యాఖ్యానించారు.
ఒక కథనో.. ఐడియానో అమ్ముకుంటే కోట్ల రూపాయలు ఆయన ఖాతాలోకి వెళ్తాయి. అలాంటి వ్యక్తి.. కేవలం లక్షల రూపాయల కోసం కక్కుర్తి పడి డ్రగ్స్ దందా చేశారనడం నమ్మశక్యం కాదన్నారు. అదే సమయంలో పూరి గనుక ఇతరులకు డ్రగ్స్ ఇచ్చుంటే.. అది కచ్చితంగా నేరమే అవుతుందని, ఆ విషయం విచారణలో తేలుతుందని అన్నారు.
ఇక కెల్విన్ కు పూరి నుంచి కొన్ని చెక్కులు కూడా అందినట్లు వస్తున్న వార్తలపై.. ఏ ఈవెంట్ మేనేజ్ కోసమో పూరీ జగన్నాథ్ దీన్ని కెల్విన్ కు ఇచ్చి వుండవచ్చని, డ్రగ్స్ కోసం రూ.4,30,021 చెక్కును ఎవరూ ఇవ్వరని అన్నారు. అసాంఘీక దందాలన్ని నగదు రూపంలో సాగుతున్నాయని గుర్తుచేశారు. డ్రగ్స్ వాడుతున్నాడని నిర్దారణ అయినా, అతని వద్ద నామమాత్రంగానైనా డ్రగ్స్ ఆనవాళ్లేమి దొరకకపోతే ఎవరూ ఏమి చేయలేరని అన్నారు.












Click it and Unblock the Notifications