హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో నలుగురు అనుమానితుల అరెస్టు: హుజీతో లింక్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : స్వాంతంత్య్ర దినోత్సవం రోజున హైదరాబాద్‌లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురికి ఉగ్రవాద సంస్థ హుజితో సంబంధమున్నట్లు పోలీసులు తేల్చారు.

వీరిలో ఇద్దరు బంగ్లాదేశ్‌కు, మరో ఇద్దరు పాకిస్తాన్, మయన్మార్‌కు చెందినవారని పోలీసులు అంటున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ నలుగురు పట్టుబడటంతో పోలీసులు నగరమంతా హైఅలర్ట్ ప్రకటించారు. మరో 15 మంది ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తులు కూడా ఏ విధమైన పత్రాలు లేకుండా హైదరాబాదులో ఉంటున్నారు. వారు చంచల్‌గుడా జైలు సమీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

Four suspects arrested in Hyderabad

తలాబ్‌కట్లలో బాంబు కలకలం

హైదరాబాద్‌లోని పాతబస్తీ తలాబ్‌కట్టలో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్యాగ్ ఉన్న ప్రాంతానికి పోలీసులు, డాగ్, బాంబ్ స్కాడ్ చేసుకుంది. డాగ్, బాంబ్ స్కాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది.

విస్తృత తనిఖీలు

హైదరాబాదులోని కెపిహెచ్‌బి కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని ఇళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Hyderabad police arrested four suspects, alleged to be having links with HUJI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X