అన్నా గడ్డం ఎప్పుడు తీస్తావు, నా లక్ష్యం నెరవేరాకే: ఉత్తమ్, ఎర్రబెల్లి మధ్య ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గడ్డం తీస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి ప్రకటించారు. అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య శుక్రవారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది. అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని లాబీల్లోనూ, అసెంబ్లీ ఆవరణలోనూ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సన్నివేశాలు కన్పిస్తున్నాయి.

Funny conversation between Uttam kumar reddy and Errabelli dayakar rao

శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీలో ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాబీలో వస్తుండగా, టీడీపీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదురు పడ్డారు. చాలా రోజులుగా ఉత్తమ్ తన గడ్డాన్ని పెంచుతున్నారు.

అన్నా గడ్డం ఎప్పుడు తీస్తావ్?" అని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. అయితే 2019లో తీస్తాను అని ఉత్తమ్ బదులిచ్చారు.తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని, అప్పటిదాకా గడ్డం తీయబోనని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాతే షేవింగ్ చేయించుకుంటానని ఉత్తమ్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Funny conversation between Congress Mla Uttamkumar reddy TRS Mla Errabelli Dayakar rao on friday at Assembly lobby.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి