ఆ పని చెయ్యకుంటే వెళ్ళిపోతాం.. రేవంత్ రెడ్డికి గల్లా జయదేవ్ అల్టిమేటం!!

తెలంగాణ రాష్ట్రంలో అమరరాజ వివాదం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అమరరాజా కంపెనీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది . తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అమర రాజా బ్యాటరీ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ ప్లాంట్ విషయంలో అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్ గల్లా షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 9500 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న అమరరాజా
ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్ కోసం వేరే చోటు చూసుకుంటామంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 9500 కోట్ల పెట్టుబడి కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వంతో అమర రాజా బ్యాటరీ కంపెనీ ఒప్పందం చేసుకుంది.

Galla Jayadev ultimatum to Revanth Reddy in Amararaja batteries plant assurances in telangana

ప్రస్తుత ప్రభుత్వం పై ఆశాభావంలో ఉన్నామన్న గల్లా జయదేవ్
తెలంగాణ రాష్ట్రంలో లిథియం అయాన్ బ్యాటరీ తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కొన్ని హామీలను ఇచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ హామీలను నెరవేరుస్తారని ఆశతో ఉన్నామని పేర్కొన్నారు గల్లా జయదేవ్.

తెలంగాణా ఆర్ధిక పరిస్థితిపై గల్లా జయదేవ్ కామెంట్స్
ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ హామీలను విస్మరిస్తే అమర రాజా ప్లాంట్ వేరే చోటికి వెళ్లే అవకాశం ఉందంటూ హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్లాంట్ కెపాసిటీ విస్తరణను మరొక చోటికి తరలించడం తప్ప మరో మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే గత ప్రభుత్వ కమిట్మెంట్లను నెరవేరుస్తారా లేదా అన్న సందేహాలు వస్తున్నాయన్నారు.

గత ప్రభుత్వ కమిట్మెంట్ లను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందా
కమిట్మెంట్లను నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వద్ద నిధులు వనరులు ఉన్నాయా అన్న అనుమానం కూడా వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇబ్బందులు ఎదురవుతాయని కూడా అనుకోవటం లేదని పేర్కొన్న గల్లా జయదేవ్ ప్రభుత్వాలు మారిపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పరిస్థితులు లేవన్నారు.

సానుకూలంగా లేకుంటే జరిగిదేదిదే.. రేవంత్ సర్కార్ కు అల్టిమేటం
పరిస్థితులు సానుకూలంగా ఉంటే ప్లాంట్ విస్తరణ తెలంగాణలోనే కొనసాగుతుందని, లేదంటే ప్లాంట్ ను వేరే చోటికి తరలించాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు అల్టిమేటం జారీ చేయడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+