వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన గాంధారి జాతర... విశేషాలు ఇవే!!

ఆదివాసీ నాయక్ పోడుల అతిపెద్ద జాతర గాంధారి జాతర నిన్న ప్రారంభం అయింది. గిరిజనులు సాంప్రదాయ గిరిజన నృత్యాలు మరియు పూజలతో ఇక్కడ గాంధారి మైసమ్మను పూజిస్తారు.

|
Google Oneindia TeluguNews

గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య, కొండ కోన పులకించేలా, చెట్టు పుట్ట పరవశించేలా గాంధారి మైసమ్మ జాతర నిన్న ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ గాంధారి మైసమ్మ జాతరకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు తరలివస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఆదివాసి నాయక్ పోడులు, గిరిజనులు ఈ జాతరలో పాల్గొంటారు.

మొదలైన ఆదివాసీల గాంధారి కోట జాతర...

మొదలైన ఆదివాసీల గాంధారి కోట జాతర...


ఇక జాతరలో భాగంగా నాయక్ పోడులు గోదావరిలోని సదర్ భీమన్న మరియు ఇతర దేవతల చెక్క శిల్పాలకు పవిత్ర స్నానాలు ఆచరించి వాటిని బొక్కలగుట్ట శివార్లలోని ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్ళతో, నృత్యాలతో ఆలయం వద్ద నాయక్ పోడులకు చెందిన రొడ్డవంశానికి చెందిన వారి ముఖ్యమైన మతపరమైన సాంస్కృతిక వ్యవహారాన్ని కొనసాగించారు. సదర్ల భీమన్న విగ్రహాల వద్ద పట్నాలు వేసి తప్పెటగుళ్ళతో, పిల్లనగ్రోవి ఆటపాటలతో ఆదివాసి గిరిజనులు చేసే ఈ సంబరం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

నేడు జాతరలో కార్యక్రమాలు ఇలా

నేడు జాతరలో కార్యక్రమాలు ఇలా

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారి కోట వద్ద మూడు రోజులపాటు నిర్వహించే గాంధారి మైసమ్మ జాతర జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఇక జాతరలో రెండవ రోజు అయిన నేడు కోటపై ఉన్న మైసమ్మకు, ఇతర దేవతలకు మహా పూజ చేసి ఇక శనివారం అర్ధరాత్రి సమయంలో నాయక్ పోడు సంఘం కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెటగుళ్ళు, పిల్లన గ్రోవి ప్రదర్శనలు ఉంటాయి. ఇక జాతరలో చివరి రోజు అయిన ఆదివారం రోజున నిర్వహించనున్న ప్రజా దర్బార్ అందరినీ ఆకట్టుకుంటుంది.

 రేపు ఆదివాసీల ప్రజా దర్బార్.. అన్ని ఏర్పాట్లు చేసిన ధికారులు

రేపు ఆదివాసీల ప్రజా దర్బార్.. అన్ని ఏర్పాట్లు చేసిన ధికారులు


ఆదివాసి గిరిజనుల ఫిర్యాదుల పరిష్కారానికి చివరి రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ ప్రజా దర్బార్ కు హాజరవుతారు. ఆదివాసీలు, గిరిజనులు తమ సమస్యలను ప్రజా దర్బార్ లో ఏకరువు పెట్టి పరిష్కరించాలని కోరుతారు. గిరిజనులు అత్యంత ఘనంగా జరుపుకునే ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

గాంధారీ కోట ఎంతో ప్రత్యేకం

గాంధారీ కోట ఎంతో ప్రత్యేకం

ఇక గాంధారి కోట విషయానికి వస్తే ఈ కోటను 1300 ఏడీలో కాకతీయ పాలకుల సహాయంతో ప్రాంతాన్ని పరిపాలించిన గిరిజన రాజులు నిర్మించారని ఇక్కడ వారు బాగా నమ్ముతారు. ఈ కోటలో పురాతన మైసమ్మ దేవాలయం ఉంది. అంతేకాదు శివుడు, వినాయకుడు, కాలభైరవుడు, హనుమంతుడి విగ్రహాలను కలిగి అద్భుతమైన వాస్తు శిల్పంతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

గాంధారీ మైసమ్మకి మొక్కులు.. ఉండవు ఏ కష్టాలు

గాంధారీ మైసమ్మకి మొక్కులు.. ఉండవు ఏ కష్టాలు

రక్షణాత్మక నిర్మాణాలు, స్నానపు ట్యాంకులు, ఇక్కడ ఉన్న శిల్ప సౌందర్యం సందర్శకులను కట్టిపడేస్తుంది. అనేక ఔషధాలకు, వనమూలికల మొక్కలకు నిలయమైన ఈ ప్రదేశం అక్కడికి వెళ్లిన వారి ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యాన్ని, సానుకూలతను కలిగిస్తుంది. గిరిజన ఆదివాసి నాయక్ పోడుల ఆరోగ్య దైవమైన మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటే పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటామని అమ్మవారు తమను రక్షిస్తారని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం.

English summary
gandhari Jatara, the biggest fair of tribals, started yesterday. These are the specialities of the jatara, and tribes worship gandhari misamma here with traditional tribal dances and puja
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X