హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంగిరెద్దులు ఆడిస్తే జైలుకే..: ధర్నాకు దిగిన కమ్యూనిటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో గంగిరెద్దు ఆటలపై పోలీసులు ఉక్కు పాపదం మోపడానికి సిద్ధపడ్డారు. గంగిరెద్దులను ఆడిస్తే యాచకులుగా గుర్తించి అరెస్టు చేసి, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దాంతో గంగిరెద్దు ఆటగాళ్లు ధర్నాకు దిగారు.

గంగిరెద్దులు ఆడించుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరతరాలుగా వృత్తినే నమ్ముకున్న గంగిరెద్దుల కులస్థులను పోలీసులు అరెస్టు చేయడం దారుణంమని టీమాస్‌ హైదరాబాద్‌ నాయకులు ఒక ప్రకటనలో అన్నారు.

వారికి ప్రత్యామ్నాయం ఏదీ..

వారికి ప్రత్యామ్నాయం ఏదీ..

గంగిరెద్దులోళ్లకు ప్రత్యామ్నాయ పనులు లేవని అంటూ తమ వృత్తిని సజావుగా చేసుకునే విధంగా ప్రభుత్వం సహకరించాలని టీమాస్‌ నాయకుడు ఎం.శ్రీనివాస్‌ కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గంగిరెద్దుల కులస్థులు తమ ఆటపాటతో ప్రజల్లో చైతన్యం నింపారని చెబుతూ అలాంటిది ప్రత్యేక రాష్ట్రంలో వారికి లభించే గుర్తింపు అరెస్టులా? అని ఎంబీసీ సంఘం నేత గుమ్మడి రాజు నరేశ్‌ ప్రశ్నించారు. గంగిరెద్దుల కులస్థులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కుటుంబానికి 3 ఎకరాల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సంక్రాంతికి ముందే..

సంక్రాంతికి ముందే..

సంక్రాంతికి చాలా రోజుల ముందే శోభాయమానంగా అలంకరించిన గంగిరెద్దులతో గంగిరెద్దుల వాళ్లు వీధుల్లోకొస్తారు. వాటిని ఆడిస్తూ ఎవరు ఏది ఇచ్చినా అది తీసుకుంటారు. చాలా కాలం నుంచి గంగిరెద్దుల కులస్థులకు ఈ వృత్తే ఆధారం. వీరిని ప్రభుత్వం బిసీ ఏ గ్రూపులో చేర్చింది.

నగరం దారి పట్టారు...

నగరం దారి పట్టారు...

వృత్తినే నమ్ముకున్న గంగిరెద్దులవాళ్లకు ఊళ్లలో సరైన ధనధాన్యాలు ముట్టడం లేదు దీంతో వారు నగరం దారి పడుతున్నారు. ధాన్యం లేకున్నా పదో పరకో అందుతుందనే ఉద్దేశంతో నగర వీధులు, కూడళ్లలో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటీవల మెదక్‌ జిల్లా కౌడిపల్లి, చిల్‌పచెడ్‌ మండలాల పరిధిలోని గంగిరెద్దులగూడెనికి చెందిన దాదాపు యాభై మంది గంగిరెద్దులతో హైదరాబాద్‌కు వస్తున్నారు.

వారినీ యాచకుల మాదిరిగానే..

వారినీ యాచకుల మాదిరిగానే..

ఇటీవల ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు బిచ్చగాళ్లను నగరం నుంచి తరలించేందుకు 77సి కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చారని, ఆ చట్టం కింద తమను కూడా చేరుస్తూ అరెస్ట్‌ చేసి జైలుకు పంపిస్తున్నారని, దిల్‌షుక్‌నగర్‌లో సోమవారం బత్తుల రాకేష్, గంట అశోక్‌ను జైలుకు పంపించారని గంగిరెద్దులవాళ్లు చెప్పారు. టీమాస్‌ జిల్లా నాయకులు ఎం. శ్రీనివాస్, ఎంబీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజు నరేష్‌ వారిని విడిపించారని తెలిపారు.

నిరసనగా వంద గంగిరెద్దులతో....

నిరసనగా వంద గంగిరెద్దులతో....

మంగళవారం హైదరాబాదులోని గొల్కొండ చౌరస్తాలో సుమారు 100కి మందికి పైగా గంగిరెద్దుల కులస్తులు ఎద్దులతో కలిసి నిరసన ప్రదర్శన జరిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన గంగిరెద్దుల కులస్తులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు, 3ఎకరాల భూమి, ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

English summary
Hyderabad police warned against Gangireddu appearnace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X