Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్‌పై 72కేసులు, అన్నీ బయటికొస్తాయి: డీసీపీ

కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్ పీడీ యాక్టుకు భయపడే విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

హైదరాబాద్: కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్ పీడీ యాక్టుకు భయపడే విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. రెండ్రోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో అయూబ్ ఖాన్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. అయూబ్ ఖాన్‌ను మంగళవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నకిలీ పాస్ పోర్టుతో పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడ్ని పట్టుకున్నారని తెలిపారు.
అయూబ్ ఖాన్.. నటోరియస్ క్రిమినల్ అని, కరుడుగట్టిన రౌడీషీటర్ అని ఆయన తెలిపారు. అయూబ్ ఖాన్‌పై మొత్తం 72 కేసులున్నాయని చెప్పిన డీసీపీ.. అందులో 9మారణాయుధాల కేసులు, 6హత్య కేసులు, 8హత్యాయత్నం కేసులు, 5టాడా కేసులు, 2డ్రగ్స్, 2డెకాయిట్, 2దొంగతనాలు, 38ఇతర కేసులున్నాయని చెప్పారు.

కరుడుగట్టిన రౌడీషీటర్ అయూబ్ ఖాన్ చిక్కాడు: ముంబైలో అరెస్ట్?

ల్యాండ్ కబ్జాను అడ్డుకున్నందుకు గతంలో ఘోరీ అనే న్యాయవాదిపై దాడి చేశాడని తెలిపారు. అంతేగాక, పోలీసులపై కూడా రెండు సార్లు దాడులు చేశాడని చెప్పారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకుంటున్నామని, ఏ నేరాస్తుడు తప్పించుకోలేడని డీసీపీ చెప్పారు.

gangster ayub khan in police custody

అయూబ్ ఖాన్‌ను 10రోజులపాటు కస్టడీకి తీసుకుంటున్నామని చెప్పిన డీసీపీ.. అతను చేసిన నేరాలు, అనుచరుల వివరాలు విచారణలో బయటికొస్తాయని తెలిపారు. ఇతడ్ని పట్టుకునేందుకు స్పెషల్ బ్రాంచ్, ఐటీ వింగ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారని చెప్పారు.

ల్యాండ్ కబ్జాలు, బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా అయూబ్ ఖాన్ పై ఉన్నాయని డీసీపీ తెలిపారు. 2010లో పాస్ పోర్టు తీసుకున్నాడని, అతని పుట్టిన తేదీని 1977గా మార్చుకున్నాడని, అతని వద్ద రెండు దొంగ పాస్ పోర్టులున్నాయని తెలిపారు. పీడీయాక్టులకు భయపడే ఇప్పటి వరకు అయూబ్ ఖాన్ పరారీలో ఉన్నాడని చెప్పారు.
నేరాలకు పాల్పడిన పాతబస్తీకి చెందిన 80మందిపై పీడీ యాక్టులు పెట్టామని తెలిపారు. నేరాలు చేసేందుకు భయపడని కారణంగానే ఇలాంటి నేరస్తులపై
పీడీయాక్టు పెడుతున్నామని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+