Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరా పవన్ కళ్యాణ్ నిర్మాత!?: జగన్.. లోకేష్.. నయీం ఇళ్ల పేర్ల చిట్టా

హైదరాబాద్/భువనగిరి: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో నాగరాజు అనే వ్యక్తి కోసం సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) గాలిస్తోంది. నయీం డెన్‌లో పెద్ద ఎత్తున సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు లభ్యమైన విషయం తెలిసిందే. వీటిని నయీంకు సరఫరా చేసింది భువనగిరికి చెందిన నాగరాజు అని అనుమానిస్తున్నారు.

సిట్ అధికారులు నాగరాజు కోసం గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతనే సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు సరఫరా చేశారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని తెలుస్తోంది. నాగరాజు పట్టుబడితే నయీంకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

ఎవరా నిర్మాత?

నయీం రాజకీయ నాయకులను, వ్యాపారులను, రియల్ ఎస్టేట్ బిజినెస్‌మెన్.. ఇలా వీరితో పాటు సినిమా పరిశ్రమలో కూడా పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో గతంలో సినిమా తీసిన నిర్మాత నయీం బాధితుడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Gangster Nayeem uses Celebrity & Movie Names for his Houses

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసిన ఆ నిర్మాత ఎవరు? అనే చర్చ సాగుతోంది. సదరు నిర్మాత నుంచి పెద్ద మొత్తంలో నయీం వసూలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. నయీం బెదిరింపుల కారణంగా సదరు నిర్మాత కొద్దికాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు.

సాజిదాను నమ్మిన నయీం

నయీం కుటుంబ సభ్యులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారించారు. రాజేంద్ర నగర్ కోర్టులో లొంగిపోయిన సాజిదా షహీన్ విచారణలో... కానిస్టేబుల్ అయినా సరే పోలీస్ అయితే గౌరవించాలని నయీం ఎప్పుడూ చెబుతుండేవాడని చెప్పిందని తెలుస్తోంది. నయీంకు సాజిదా అత్యంత సన్నిహితంగా వ్యవహరించిందని తెలుస్తోంది. ఈమె నుంచి పోలీసులు కీలక ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు.

తన సోదరి కుమార్తె (మేనకోడలు) అయిన సాజిదాను నయీం బాగా నమ్మేవాడని పోలీసులు గుర్తించారు. ఫహీంతో పెళ్లి కాకముందు నుంచే ఈమె నయీం వెంట తిరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో పలు కార్యకలాపాల్లో నయీంతో పాలుపంచుకొంది. ఆయుధాల వినియోగంలోనూ నయీం ఈమెకు శిక్షణ ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. నయీం ఇళ్లలో ఎక్కువ ఈమె పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయి.

బుధవారం నుంచి ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లభించడంతో చంచల్‌గూడ జైలు నుంచి ఫర్హానా, అఫ్షాతోపాటు సాజిదాను అదుపులోకి తీసుకున్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న ఫహీంనూ కస్టడీకి తీసుకున్నారు.

నయీం ఏ ఇంటికి ఏ పేరు పెట్టారు?

నయీం ఇరవై ఒక్క ఇళ్లు ఉన్నాయని, వాటికి సినిమా తారలు, సినిమాలు, రాజకీయ నాయకులు.. ఇలా వివిధ పేర్లు పెట్టేవాడని వెలుగు చూసిన విషయం తెలిసిందే. గజనీ, దృశ్యం, బిల్లా, సిమ్లా, ఊటీ, వైయస్సార్, లోకేష్, జగన్.. ఇలా పేర్లు పెట్టేవాడు. కేవలం తన వాళ్లకు మాత్రమే అర్థమయ్యేలా కోడ్ భాష వినియోగించేవాడు.

Gangster Nayeem uses Celebrity & Movie Names for his Houses

నయీం ఇల్లు హైదరాబాద్ శివారుల్లోనే ఉన్నా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ నివాసాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటికి నయీం పెట్టిన పేర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పేర్లు ఎందుకు పెట్టాడంట.. ఎవరికీ అర్థం కాకుండా కోడ్ కోసం కావొచ్చని భావిస్తున్నారు. ఆ పేర్లు పెట్టడం వెనుక అసలు గుట్టు ఏమిటో పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు.

నయీం తన ఇళ్లకు పెట్టుకున్న పేర్లు ఇవీ...

వైయస్సార్ హౌస్‌ అల్కాపురి టౌన్‌షిప్‌లో, దృశ్యం హౌస్‌ పుప్పాలగూడలో, పప్పు హౌస్‌ పుప్పాలగూడ తిరుమల హిల్స్‌‌లో, ఇందిరా హౌస్‌ మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్‌‌లో, పింకీ హౌస్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని షాద్‌నగర్‌‌లో, కోకోనట్‌, చర్చ్‌ హౌస్‌లు గోవాలో, డెవిల్‌ హౌస్‌ ఒంగోలులో, ఫిష్ కా ఘర్ విజయవాడలో, సోనీ కీ ఘర్‌ ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

రంగన్న హౌస్‌.. గౌసియా బావ అన్నట్లగా డైరీలో రాసి ఉందని తెలుస్తోంది. లోకేష్‌ హౌస్‌.. బబీదా అమ్మానాన్నా అని రాసి ఉంది. రాజమండ్రిలో సానియా హౌస్ ఉన్నట్లుగా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+