వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీహెచ్ఎంసీకి స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయ అవార్డ్.!అవార్డ్ కోసం కృషి చేసినవారికి మేయర్ ప్రశంసలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పథకంలో బాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయ స్థాయిలో అవార్డుకు కృషి చేసిన అడిషనల్ కమిషనర్ బి సంతోష్. జాయింట్ కమిషనర్ సంధ్య కు నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫ్రీ గార్బేజ్, ఉత్తమ స్వీయ స్థిరమైన నగరంగా అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు, పట్టణాలకు జాతీయస్థాయిలోనూ, లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాలకు రాష్ట్ర, జోనల్ స్థాయిలో అవార్డులు అందజేస్తారనీ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 4,384 నగరాలను కవర్ చేస్తుందని మేయర్ అన్నారు. జిహెచ్ఎంసి 40లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీ లో ఉత్తమ స్వీయ స్థిరమైన నగరంగా అవార్డు సొంతం చేసుకోవడంతో పాటు చెత్త రహిత నగరాలకు స్టార్ రేటింగ్ లో 3స్టార్ సిటీగా అవార్డు పొందేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ మేయర్ అభినందించారు.

GHMC wins Clean Survection 2021 National Award!Mayor congratulates the staff

భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పనిచేసి మరిన్ని అవార్డులు అందుకోవాలని మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఆకాక్షించారు. ఇదిలా ఉండగా నగరంలో కరోనా వ్యాధి ముంపు నుండి నగర ప్రజలను విముక్తి చేసేందుకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కాలనీలలో సెకండ్ డో స్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిహెచ్ఎంసి మేయర్ తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 4,846 కాలనీలలో గతంలో మొదటి డోస్ కార్యక్రమాన్ని పూర్తి చేశామని, మూడో ముంపు ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేపట్టేందుకు జిహెచ్ఎంసి కసరత్తు చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో కాలనీలలో వాక్సినేషన్ కేంద్రాలు, బస్తీ దవాఖానాలతో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వాక్సినేషన్ వేస్తారని స్పష్టం చేసారు. వాక్సినేషన్ డ్రైవ్ లో బాగంగా నగరంలో 4,846 కాలనీలలో ముందు రోజు ఇంటింటి వెళ్లి గుర్తించి జాబితాను తయారు చేసి మరుసటి రోజు వాక్సిన్ వేసుకునే విధంగా సిబ్బంది కార్యాచరణ ఉంటుందని, అంతే కాకుండా సంబంధిత ఇంటికి స్తిక్కర్ వేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గద్వాల విజయ లక్ష్మి కోరారు.

Recommended Video

Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
GHMC wins Clean Survection 2021 National Award!Mayor congratulates the staff
English summary
Additional Commissioner B Santosh,Joint Commissioner Sandhya congratulated City Mayor Gadwala Vijaya Lakshmi for the Swachha Survey 2021 National Award for Greater Hyderabad Municipal Corporation as part of the Swachha Bharat Mission Urban Scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X