ఇద్దరి మగాళ్ల మధ్య యువతి: ఆత్మహత్యాయత్నం
వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసుస్టేషన్ ఎదుట ఓ యువతి మంగళవారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోంకు తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధితురాలి తల్లితండ్రులు మేడిపల్లి శోభ, అశోక్ వివరించారు. నర్సంపేట మండలంలోని లక్నెపల్లికి చెందిన మేడిపల్లి అనూష ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌కు చెందిన వెల్ది రాకేష్ ఇద్దరు ప్రేమించుకున్నారు.
రాకేష్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. అయితే కొద్దికాలానికే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఈ సమయంలో అనూషకు మరో వ్యక్తితో తల్లితండ్రులు వివాహం చేశారు. అయితే, రాకేష్ అనూష భర్తకు తరచూ ఫోన్ చేసి ఆమె తన ప్రియురాలని, విడాకులు ఇవ్వాలని వేధించసాగేవాడు. దీంతో అనూషకు ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. ఈ తరుణంలో అనూష రాకేష్‌ను తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇదే సమయంలో అనూష గర్భవతి అయింది.

అబార్షన్ చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని రాకేష్ చెప్పడంతో అబార్షన్ సైతం అనూష చేయించుకుంది. అయినప్పటికీ రాకేష్ పెళ్లి చేసుకోకుండా మరో యువతితో పెళ్ళి చేసుకునేందుకు సంబంధం కుదుర్చుకోవడంతో ఆమె రాకేష్‌ను నిలదీసింది. ఈ నేపథ్యంలో రాకేష్‌పై ఆగస్టు 23న నర్సంపేట పోలీసుస్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాకేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.
మళ్లీ గత కొద్ది రోజులుగా వీరి వ్యవహారంపై పెద్ద మనుషుల మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో రాకేష్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టకుండా బెయిలబుల్ కేసు పెట్టారని ఆందోళన చెందుతూ మంగళవారం ఉన్నపళంగా పోలీసుస్టేషన్ ఎదుట అనూష నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఎస్సై బాబులాల్ వివరణ
నర్సంపేట ఎస్సై బాబులాల్‌ను వివరణ కోరగా ఆగస్టులోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు వెల్ది రాకేష్‌పై చీటింగ్ కేసు నమోదు చేశామని చెప్పారు. అనూష మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఆవరణలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా? అని ప్రశ్నించగా పోలీసుస్టేషన్ ఆవరణలో మాత్రం కాదని సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications