ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్: వెంటాడుతూ బాలికపై అత్యాచారం

హైదరాబాద్: ప్రేమించానని వెంటపడుతూ ఆమెకు తెలియకుండా ఫొటోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసి ఓ బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేశాడు. అతన్ని హైదరాబాదులోని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. గోల్నాక సాయిబాబా దేవాలయం వద్ద నివసిస్తున్న చెన్నారెడ్డి కుమారుడు జగత్‌పాల్‌ రెడ్డి పదో తరగతి వరకు చదివాడు.

కొత్తూరులోని ఓ బిస్కెట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో జూనియర్‌ అయిన ఓ బాలికను ప్రేమించమని వెంటబడ్డాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అత్యాచారం చేశాడు.

ఆరు నెలలుగా బాలికను వేధిస్తున్నాడు. అతడి ఆగడాలను భరించలేక పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. జగత్‌పాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

girl blackmailed and raped in Hyderabad

ఇదిలావుంటే, సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించుకోవడానికి వెళ్లిన యువతిని వేధిస్తున్న వ్యక్తిపై హైదరాబాదులోని మలక్‌పేట పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. మలక్‌పేట నివాసి సత్యనారాయణ చైతన్యపురిలో సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఓ యువతి(21) ఫోన్‌ రిపేర్‌ చేయించుకోవటానికి అతడి వద్దకు వెళ్లింది.

ఆమెతో పరిచయం పెంచుకున్న అతడు ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. వివాహం నిశ్చయ మైందని చెప్పినా వేధిస్తున్నాడు. బాధితురాలు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ రంజితకుమార్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+