ప్రేమ పేరుతో ఆమెను గర్భవతిని చేశాడు: శీలానికి ఖరీదు కట్టాడు
మంచిర్యాల: తల్లిదండ్రులు లేని ఓ యువతిని ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. గర్భం దాల్చడంతో ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. పంచాయతీ కోసం పెద్ద మనుషుల వద్దకు వెళ్తే ఆమె శీలానికి ఖరీదు కట్టారు.
రూ. 2.25 లక్షలు ఇప్పిస్తామని, అబార్షన్ చేయించుకోవాలని ఆమెకు వారు సలహా ఇచ్చారు. ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు అబార్షన్ కాదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె పోలీులను ఆశ్రయించింది.

ఒంటరిగా ఉంటున్న యువతి
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన 22 ఏళ్ల యువతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. మంచిర్యాలలోని భగవంతంవాడలో అద్దెకు ఉంటూ భవన నిర్మాణ కూలీగా పనిచేస్తోంది.

ఇలా నమ్మించి మోసం
పట్నంలోని ఎడ్లవాడకు చెందిన తాపీమేస్త్రీ చౌదరి శంకర్ (25)తో ఆమెకు పరిచయం కలిగింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసువాలని ఒత్తిడి చేయడంతో గత ఐదు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.

పెద్ద మనుషుల తీర్పు ఇదీ
తీవ్రంగా ఒత్తిడి పెట్టి నిలదీయడంతో పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టాడు. న్యాయం చేయాల్సిన పెద్దలు శంకర్ వైపు నిలిచి యువతి శీలానికి ఖరీదు కట్టారు. రూ. 2.25 లక్షలు ఇప్పిస్తామని, అబార్షన్ చేయించుకోవాలని యువతికి సలహా ఇచ్చారు.

తీరా ఆమె ఆస్పత్రికి వెళ్తే...
తొలుత అందుకు అంగీకరించడంతో ఆమెను భయపెట్టారు. తొలుత లక్ష రూపాయలు ఇప్పించారు వాటిని తీసుకుని ఆమె అబార్షన్ చేయించుకునేందుకు ఓ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె అప్పటికే 8 నెలల గర్భవతి. దాంతో అబార్షన్ సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications