రెచ్చిపోయిన కామాంధులు: బంధించి యువతిపై కొన్నాళ్లుగా గ్యాంగ్ రేప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో కామాంధులు రెచ్చిపోయారు. మహిళలపై కీచకపర్వానికి ఒడిగట్టిన రెండు సంఘటనలు ఒక్క రోజే నగరంలో వెలుగు చూశాయి. హైదరాబాదులోని ఎల్బీననగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టుల పరిధుల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో దుండగులు ఓ యువతిని కిడ్నాప్ చేసి, గత కొంత కాలంగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. బాధితురాలు దండగుల కళ్లు కప్పి బుధవారం రాత్రి తప్పించుకుని వచ్చి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వాచ్‌మన్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు.

మరో ఘటన ఎల్బీనగర్ బండ్లగూడలో చోటు చేసుకుది. ఓ బాలికపై ఓల్డ్ ఏజ్ హోం నిర్వాహకుడు రామకృష్ణ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. దీంతో బాలిక స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ సంఘటనపై ప్రజా, మహిళా సంఘాల నాయకులు, మేధావులు ఆందోళన వ్యక్తంచేశారు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications