బాలికపై రేప్, హత్యాయత్నం: రాజస్థాన్‌లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య
మెదక్/ హైదరాబాద్: మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాములు అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ బాలికను హతమార్చేందుకు యత్నించాడు. రాములు చెర నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాములపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే, మెదక్ జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన ఆర్మీ జవాను దేవర శ్రీనివాస్(25) రాజస్థాన్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్‌కు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. పెళ్లి కోసం నెల రోజులు ముందుగా సెలవు అడగడంతో కమాండర్ ఇవ్వలేదని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా, అతడు 9 నెలల క్రితమే ఆర్మీలో చేరాడు.

హైదరాబాదు నగరంలోని పహడీషరీఫ్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. సంతానం విషయంలో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తడంతో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మహేశ్వరం మండలం శారదానగర్‌లో నివాసముంటున్న నరేందర్, మౌనిక దంపతులు సంతానం విషయంలో ఘర్షణ పడ్డారు.
దీంతో మనస్తాపానికి గురైన మౌనిక ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, భార్య మృతి తట్టుకోలేకపోయిన భర్త నరేందర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications