ప్రియుడ్ని బెదిరించి యువతిపై అధికార పార్టీ నేత రేప్: తెరాస నేత కుమారుడి మృతి

హైదరాబాద్: ఓ అధికార పార్టీ నాయకుడు ప్రేమ జంటను బెదిరించి యువతిపై అత్యాచారం జరిపిన సంఘటన వరంగల్ జిల్లా శాయంపేటలో జరిగింది. అధికార పార్టీ నేత యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ప్రియుడి నుంచి డబ్బులు వసూలు చేసి వేధిస్తున్నాడు.

దీనిపై అత్యాచారానికి గురైన యువతితో పాటు ఆమె ప్రియుడు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదిలావుంటే, శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాదు సమీపంలోని రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత మైసయ్య అతడి కుమారుడితో కలిసి శబరిమలకు వెళ్లి వస్తుండగా తిరుపతిలో వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది.

Girl raped threatening her lover in Warangal district

ఈ ఘటనలో మైసయ్య కుమారుడు చింటూ అక్కడికక్కడే మృతి చెందాడు. మైసయ్య, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కిడ్నీ రాకెట్‌లో మరో ఇద్దరి అరెస్టు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌పై విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కిడ్నీ అమ్ముకున్న ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు మండలం ఎద్దుమైలారానికి చెందిన నక్క శివరాజ్‌గౌడ్, చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ వాసిముద్దీన్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరు ఏజెంట్‌ సురేష్‌ ద్వారా కిడ్నీ అమ్ముకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 16 మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+