గోరింటాకు పెట్టుకున్నారని అమ్మాయిలను శిక్షించిన ప్రిన్సిపాల్
హైదరాబాద్: చేతులకు గోరింటాకు పెట్టుకున్నారనే కోపంతో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆరుగురు అమ్మాయిలకు శిక్ష విధించారు. ఈ సంఘటన హైదరాబాదులోని హైదర్‌గుడా ప్రైట్ స్కూల్లో జరిగింది. ఈ విషయాన్ని ఎస్‌సిపిసిఆర్ చెప్పింది.
ఎస్‌సిపిసిఆఆర్ ఈ సంఘటనపై కలెక్టర్‌కు, జిల్లా విద్యాధికారికి నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై తీసుకున్న చర్యలేమిటో నవంబర్ 16వ తేదీలోగా తెలియజేయాలని ఆ సంస్థ నోటీసుల్లో ఆదేశించింది.

దసరా పర్వదినం సందర్బంగా విద్యార్థినులు చేతులకు గోరింటాకుడు పెట్టుకున్నారు. దసరా సెలవుల తర్వాత సోమవారంనాడు పాఠశాలను తిరిగి తెరిచారు. చేతులకు గోరింటాకు పెట్టుకున్న అమ్మాయిలను చూసి ప్రిన్సిపాల్ వారిని బయటకు పంపించేసినట్లు అచ్యుతరావుచెప్పారు.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఎస్‌సిపిసిఆర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications