వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ; మళ్ళీ ముంపు ముప్పు!!

|
Google Oneindia TeluguNews

భద్రాచలం వద్ద మరోమారు గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకూ గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటుగా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు . గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి నది 53 అడుగుల ప్రమాద స్థాయిని అధిగమించింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

గోదావరి వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

గోదావరి వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక


తెలంగాణ రాష్ట్రంలోని బాసర నుండి భద్రాచలం, ఆపై పోలవరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరి ప్రమాదకరస్థాయిలో ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం దగ్గర మంగళవారం సాయంత్రం నీటిమట్టం పెరగటంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎగువ రాష్ట్రాలు భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నాయి. ఇక కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. 12.140 మీటర్ల ఎత్తులో గోదావరి కాళేశ్వరం వద్ద ప్రవహిస్తోంది. దీంతో అక్కడ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందికి వదులుతున్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

ఇక ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఈరోజు రాత్రికి 56 అడుగులకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల సహా తొమ్మిది మండలాల్లో వరద హెచ్చరిక జారీ చేశారు.

నెల రోజుల్లో మూడు సార్లు గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక

నెల రోజుల్లో మూడు సార్లు గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక

ఇప్పటికే జులై నెలలో వచ్చిన వరదల కారణంగా అనేక గ్రామాలు నీట మునిగి, ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా ఆ నష్టం నుండి కోలుకోక ముందే ఇప్పుడు మళ్లీ గోదావరి వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రజలు భయాందోళనలో బ్రతుకుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో నెలరోజుల్లో మూడుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి వరద ప్రవాహం సాగుతోంది. ఇప్పటికే భద్రాచలం ఏజెన్సీలోని పలు అంతర్గత గ్రామాలకు గోదావరి వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.

తెలంగాణా, ఏపీలలో పలు గ్రామాలు జల దిగ్బంధం

తెలంగాణా, ఏపీలలో పలు గ్రామాలు జల దిగ్బంధం

భద్రాచలం, పినపాక నియోజకవర్గాల లోని పలు ప్రాంతాల్లో రోడ్లమీదకు వరద నీరు వచ్చి చేరింది. అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం రహదారి మీదికి వరద నీరు చేరుకుంది. గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇక గోదావరికి వరద ఉధృతి నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ముంపు మండలాలలో కూడా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని పలు గ్రామాలు నీటమునిగాయి.

 ధవళేశ్వరం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. రాజమండ్రి లోని ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి వరద పోటెత్తుతోంది. బ్యారేజీ నీటిమట్టం 14.80 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 14.35 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

English summary
Godavari is experiencing record floods. A third danger alert has already been issued at Bhadrachalam. In AP and Telangana, the people of the catchment area are afraid of raging Godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X