భక్తులకు శుభవార్త.. తెలంగాణాలో పసిద్ద ఆలయాలతో టెంపుల్ కారిడార్ ఏర్పాటు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రిగుట్ట, బాసరను కలుపుతూ టెంపుల్ కారిడార్ ను అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది.

ఉత్తర తెలంగాణా టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టు ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అదేవిధంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధితో దీనిని అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, రోడ్ కనెక్టివిటీని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలలో ఉన్న ఈ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారు.

Good news for devotees Temple corridor to be established with famous temples in Telangana

Take a Poll

ఆలయాలకు రోడ్ కనెక్టివిటీ పెంచటం లక్ష్యంగా ప్రాజెక్ట్
ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే యాత్రికులకు రోడ్డు కనెక్టివిటీని గణనీయంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రాజెక్ట్. టెంపుల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో రెండు ప్రధాన సర్కిల్లో రోడ్లను అప్గ్రేడ్ చేయడానికి, వెడల్పు చేయడానికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. నిజామాబాద్ వన్ సర్కిల్ లోని 15 రోడ్లను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం దాదాపు 412.33 కోట్లను కేటాయించింది.

నిజామాబాద్ తో పాటు ఈ సర్క్యూట్ లలో రోడ్ల అభివృద్ధి
నిజామాబాద్ టు సర్కిల్లోని మరో 15 రోడ్ల కోసం 253. 69 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టును డెవలప్ చేయడానికి హామ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని 30 రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. అలాగే ఈ కారిడార్ లో చేర్చిన ప్రధాన యాత్రా స్థలాలకు మరింత కనెక్టివిటీని పెంచడం కోసం మల్లాపూర్, కొల్లూరు, హున్స, సాలూరు, నందిపేట, యాంచ, బాసర వంటి రోడ్లను పునరుద్ధరిస్తారు.

ఆయా ప్రాంతాల ఆర్ధిక అభివృద్ధికి ఉత్తర తెలంగాణా టెంపుల్ కారిడార్
భక్తులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తారు. ఈ కారిడార్ యాత్రికులకు ప్రయోజనాన్ని చేకూర్చడమే కాకుండా, ఈ ఆలయాలకు వచ్చే యాత్రికుల ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ కనెక్టివిటీతో ధర్మపురి, కొండగట్టు, లింబాద్రిగుట్ట, వేములవాడ, బాసర ఆలయాలు ఎక్కువమంది భక్తులను ఆకర్షించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తాయనే అంచనా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+