రేషన్ కార్డు కలిగివున్న వారికి గుడ్‌న్యూస్: వెంటనే ఈ పని చేయండి

రేషన్ కార్డు కలిగివున్న వారికి ఇది అద్భుత అవకాశం. రేషన్ కార్డులో మార్పులు, సవరణలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాలా మంది పేరెంట్స్ తమ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. అలాగే, రేషన్ కార్డులో కొత్తగా పెళ్లైన కొడుకు పేరు ఉండి కోడలి పేరు లేని వారు కూడా చాలా మందే ఉన్నారు.

కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు ఉండి.. అందులో పేరు లేని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం తాజా మంచి అవకాశం కల్పించింది. ఇందుకోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. అంతేగాక, మీ రేషన్ కార్డుకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నా సవరించుకోవచ్చు. అంటే, చిరునామా (అడ్రస్) మార్చుకోవడం, పేర్లలో తప్పులు ఉంటే మార్చుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇంతకీ, రేషన్ కార్డులో కొత్తవారిని ఎలా యాడ్ చేసుకోవాలి? తప్పులు ఎలా సవరించుకోవాలి? ఏ ఏ ధ్రువపత్రాలు అవసరం? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం..

Good news for ration card holders

రేషన్​ కార్డులో తప్పుల సవరణకు దరఖాస్తు విధానం:

రేషన్ కార్డు సవరణ, కొత్త మెంబర్​ యాడింగ్ కోసం.. ముందుగా 'Telangana Mee seva Portal'ని సందర్శించాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే Services అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయిన పేజీలో Search for Services అనే బటన్​‌పై క్లిక్​ చేయాలి.

ఆ తర్వాత Department అనే ఆప్షన్‌​లోకి వెళ్లి Selectపై క్లిక్ చేసి Civil Supplies అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి. అనంతరం ఓపెన్ అయిన పేజీలో 'Corrections in Food Security Card' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే నెక్ట్ వచ్చే పేజీలో రైట్​ సైడ్​‌కి Download Application Form అని కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేసి ఆ ఫారంను డౌన్‌​లోడ్ చేసుకోండి.

ఆ తర్వాత ఆ ఫారంను ప్రింట్​ అవుట్ తీసుకోవాలి. ఫాంపైన Address Change/ Member Details Modifications/ Member Addition అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు అందులో మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానిపై టిక్ చేసి సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

చివరగా కావాల్సిన ధ్రువపత్రాలు మీరు ఫిల్ చేసిన ఫారంకు​కి యాడ్ చేసి
దగ్గరలోని మీసేవా కేంద్రంలో సమర్పించాలి. లేదంటే, మీరు డైరెక్ట్‌గా కావాల్సిన పత్రాలు తీసుకొని దగ్గరలోని మీ సేవా వద్దకు వెళ్లినా అక్కడి సిబ్బంది ప్రక్రియను పూర్తి చేస్తారు.

కాగా, అప్లికేషన్ ఫారమ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అంతేగాక, అప్లికేషన్​‌లో పేర్కొన్న మరికొన్ని సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం, అధికారుల వెరిఫికేషన్ అనంతరం మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు పూర్తి అవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+