తెలంగాణ రేషన్ డీలర్లకు గుడ్‌న్యూస్
హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీపై కమీషన్ పెంచుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ మేరకు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు.
బియ్యం పంపిణీపై కమీషన్ టన్నుకు రూ. 700 నుంచి రూ. 1400 వరకు పెంచుతున్నట్లు మంత్రి గంగలు తెలిపారు. కమీషన్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 245 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. దాదాపు 17 వేల మందికిపైగా రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలందించాలని ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు మంత్రి గంగుల విజ్ఞప్తి చేశారు.

రూ. లక్ష కోట్లతో విద్యుత్ అభివృద్ధి, 35,774 కొలువులు: జగదీష్ రెడ్డి
రూ. లక్ష కోట్లతో తెలంగాణా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్ రంగాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించామన్నారు. ఉద్యమ కాలంలోనే తెలంగాణ విద్యుత్ రంగాభివృద్ధితోపాటు ఈ సంస్థలను ఎవరీ చేతుల్లో పెట్టాలన్న ప్రణాళికలు రూపొందించుకున్న దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
అందువల్లే ఈరోజు యావత్ భారతదేశం లోనే తెలంగాణా విద్యుత్ రంగం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి ప్రశంసించారు.
టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియర్ లైన్‌మెన్‌లకు శనివారం రాత్రి యస్ ఆర్ నగర్ లోని జెన్కో ఆడిటోరియంలో మంత్రి జగదీష్ రెడ్ది నియామక పత్రాలను అంద జేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో గత తొమ్మిదిన్నరేండ్లలో 35,774 ఉద్యగాలను భర్తీ చేశామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ఎస్‌పీడీసీఎల్ నియమించిన 10,312 ,ట్రాన్స్ కోలో 4,403 జెన్కో లో 3,689, ఎన్పీడీసీఎల్‌లో 4,370 మొత్తం కలిపి 22,774 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. అదే విదంగా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 13,000 మందిని నియమించామని వివరించారు. ఇక, మరో 670 ఉద్యగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.












Click it and Unblock the Notifications