సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గుడ్‌న్యూస్
తమ సంస్థలో పనిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి శుభవార్త చెప్పింది. దాదాపు 25వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30 లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ సాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కాంటాక్టర్ ఉద్యోగికి బీమా అమలవుతుందని సింగరేణి చైర్మన్, ఎండీ బలరామ్ ప్రకటించారు.
సింగరేణి భవన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఎండీ బలరామ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేసేందుకు ప్రతీ కాంట్రాక్ట్ ఉద్యోగి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సాలరీ అకౌంట్ ఉండాలన్నారు. ఈ విషయంలో ఏరియా జీఎంలు సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక భద్రత చర్యల్లో భాగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామని.. వారి కుటుంబ సభ్యులకు, పిల్లలకు కూడా ఆరోగ్య సేవలు అందించే విషయంపై ఈఎస్ఐ ఆసుపత్రుల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సింగరేణి ఎండీ బలరామ్ తెలిపారు.
కొత్తగూడెం, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (NTPC)లలో ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్మిక చట్టాలు, కోర్టు దిశా నిర్దేశం ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పీఎఫ్, సీఎంపీఎఫ్, పింఛన్ కోసం జీతంలో కొంత రికవరీ చేసి.. కాంట్రాక్టర్ల ద్వారా అంతే మొత్తాన్ని కలిపి వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందన్నారు.
జీతాలు, పీఎఫ్, సీఎంపీఎఫ్ చెల్లింపులు సకాలంలో సంక్రమంగా జరిగేందుకు వీలుగా వారికి సంబంధించిన మస్టర్లను కూడా వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియను చేపడుతున్నట్లు సింగరేణి ఎండీ తెలిపారు. వచ్చే నెల మొదటివారం నుంచి దీన్ని అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
కాగా, సింగరేణి ఉద్యోగుల కోసం ఇప్పటికే ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్‌ల ద్వారా రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం, ఉప ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించామని తెలిపారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం హెచ్‌డీఎఫ్‌సీతోనూ ఒప్పందం చేసుకుని రూ.30 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రూ.50 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయాన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని సింగరేణి ఎండీ చెప్పారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications